చిత్రం: స్టూడెంట్ నెంబర్.1 ( 2001 )
రచన: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
పల్లవి: నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని... చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని... నాకు అనిపించింది.. నమ్మకం కుదిరింది.. అన్ని కలిసొచ్చి ...ఈ పిచ్చి మొదలయ్యింది... పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది... పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది... నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా.. పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది... పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది... చరణం 1: ఈ కాంతలోన దాగివుంది ఆయస్కాంతము... తన వైపు నన్ను లాగుతుంది వయస్కాంతము... ఒహొ..ఒహొ...ఒ..ఒ... నీ చేతిలోన దాగి వుంది మంత్ర దండము... నువ్వు తాకగానే చెంగుమంది మగువ దేహము... ఒహొ..ఒ..ఒహొ..ఒ.. ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి .. ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి.. వలపు గుర్రమెక్కి వనిత చేయమంది స్వారీ... పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది... నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా.. పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది... చరణం 2: నా ఈడు నేడు పాడుతుంది భామ దండకం... నా ఒంటి నిండ నిండివుంది ఉష్ణ మండలం... ఒహొ..ఒ..ఒహొ..ఒ.. నా పాత పెదవి కోరుతుంది కొత్త పానకం.. నా అందమంత చూపమంది హస్త లాఘవం.. ఒహొ..ఒ..ఒహొ..ఒ... కలిసుంటే ఏకాదశి... కలబడితే ఒకే ఖుషి కలిసుంటే ఏకాదశి ...కలబడితే ఒకే ఖుషి వయసులోన ఉన్నోళ్ళకి తప్పదీ స్వయంకృషి...ఈ... పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది... నిజంగా నిజంగా ...ఇలా ఈరోజే తొలిసారిగా.. పడ్డానండి ప్రేమలో మరి..విడ్డూరంగా ఉందిలే ఇది..
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి