20, జూన్ 2021, ఆదివారం

Surya IPS : Om Namo Nama Yavvanama song lyrics(ఓం నమో నమా యవ్వనమా రావమ్మా)

చిత్రం: సూర్య.IPS(1991 )

సంగీతం: ఇళయరాజా

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి :
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా ఓం నమో నమా యవ్వనమా రావమ్మా ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా ఈ చిటాపటా చింత నీ దయే కదా అంతా ఇక చేసేదేముంది అయ్యోరామా.. ఓం నమో నమా యవ్వనమా రావమ్మా ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
చరణం: 1
ఏపుగ ఊగే ఒంపుల పైరూ.. కోతకు సైయందే హ హ హ హా ఊపుగ రేగే చూపుల ఏరూ కోకను తోసిందే... కొంగెట్టి కూసే రంగుల ఊసే ఒంగొంగి చూసే లొంగని ఆశే వెర్రెక్కే కన్నూ వేటాడెనే నిన్నూ ఏమూల దాచేదీ సింగారం ఓం నమో నమా యవ్వనమా రావమ్మా ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా ఈ చిటాపటా చింత నీ దయే కదా అంతా ఇక చేసేదేముంది అయ్యోరామా.. ఓం నమో నమా యవ్వనమా రావమ్మా ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
చరణం: 2
ఏటికి సైతం ఏతం వేసే వేగం బాగుందే... పైటకు సైతం పాటలు నేర్పే రాగం లాగిందే... ఏకల్లే చేరి మేకైనావూ సోకుల్లో ఊరి చెలరేగావూ తాంబూలం తెచ్చా.. తడి పొడి పంచా ఎన్నాళ్ళు మోస్తావు.. వయ్యారం ఓం నమో నమా యవ్వనమా రావమ్మా ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా ఈ చిటాపటా చింత నీ దయే కదా అంతా ఇక చేసేదేముంది అయ్యోరామా.. ఓం నమో నమా యవ్వనమా రావమ్మా ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి