చిత్రం: స్టూడెంట్ నెంబర్.1 ( 2001 )
రచన: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
పల్లవి:
ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ
నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా
ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ
నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా
పాలతోనా పూలతోనా వెన్నతోనా జున్నుతోనా
రంభ ఊర్వశి మేని చమటతోనా
ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి
ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ
నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా
చరణం 1:
నిన్ను చూసినప్పుడే కనకదుర్గకు నేను మొక్కుకున్నా
నీకు కన్నుకొట్టు కుంటానని
నిన్ను కౌగిలించు కుంటానని
నిన్ను కలిసినప్పుడే సాయిబాబకు నేను మొక్కుకున్నా
నీతో సందిచేసుకుంటానని
నీతో సందులోకి వస్తానని
రాఘవేంద్ర స్వామికి మొక్కుకున్నా
నీతో భాగస్వామినౌతానని
మూడుకళ్ళ శివుడికి మొక్కుకున్నా
నీతో మూడు రాత్రులవ్వాలని
ఆఖరికి ఆఖరికి నీకే మొక్కుకున్నా
నీ నౌకరుగా ఉంటానని తీపి చాకిరులే చేస్తానని
ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి
ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ నిను మీ అమ్మ
నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ
ఉక్కుతోనా ఉగ్గుతోనా నిప్పుతోనా పప్పుతోనా
కాముడు పంపిన కోడి పులుసుతోనా
ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి
ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ నిను మీ అమ్మ
నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ
చరణం 2:
నువ్వు కట్టుకొచ్చిన గళ్ళచీరతో ఒకటి చెప్పుకున్నా నిన్ను చూడగానే జారాలని ఆ మాట నోరు జారొద్దని నువ్వు పెట్టుకొచ్చిన కళ్ళజోడుతో ఒకటి చెప్పుకున్నా మేము అల్లుకుంటే చూడొద్దని ఈ లొల్లి బయట చెప్పొద్దని చెవులకున్న దుద్దులతో చెప్పుకున్నా చిలిపి మాటలన్ని వినోద్దే అని కాలికున్న మువ్వలతో చెప్పుకున్నా మసక చీకటేల మూగ బొమ్మని నీ కన్నె తనానికే చెప్పుకున్నా తనకేవేవో చెబుతానని అవి నీక్కూడా చెప్పొద్దని ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ నిను మీ అమ్మ నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి