30, జూన్ 2021, బుధవారం

Suswagatham : Ye Swapnalokala Soundarya Rashi Song Lyrics (ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి)

చిత్రం: సుస్వాగతం(1997)

సంగీతం: S.A.రాజ్ కుమార్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: బాలసుబ్రహ్మణ్యం


ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందుచేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందుచేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి తళతళ తారక మెలికల మేనక మనసున చేరెగా కలగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందుచేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి తొలిచూపు చాలంట చిట్టాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా తొలిచూపు చాలంట చిట్టాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా పదిమంది అంటుంటె విన్నాను ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో ఆ కాంతిలో ఈనాడె నా ఉదయమైనదో మధుసీమలో ఎన్ని మరుమల్లె గంధాలు మునుపెన్నడూలేని మృదువైన గానాలు మొదటి వలపు కథలు తెలుపు గేయమై తీయగా స్వరములు పాడగా ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందుచేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి మహరాణి పారాణి పాదాలకేనాడు మన్నునంటనీయక మహరాణి పారాణి పాదాలకేనాడు మన్నునంటనీయక నడిచేటి దారుల్లో నా గుండె పూబాట పరుచుకుంది మెత్తగా శాంతికే ఆలయం ఆమె నెమ్మది అందుకే అంకితం అయినదీ మది సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు చెలియ చలువ చెలిమి కొరకు ఆయువే ఆశగా తపములు చేయగా ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందుచేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి తళతళ తారక మెలికల మేనక మనసున చేరెగా కలగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందుచేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి