Suswagatham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Suswagatham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, జులై 2021, శనివారం

Suswagatham : Happy Happy Song Lyrics (హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు)

చిత్రం: సుస్వాగతం(1997)

సంగీతం: S.A.రాజ్ కుమార్

సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ

గానం: P.జయచంద్రన్, మనో


హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగా

శుభాకాంక్షలందజేయుమా మిత్రమా

ఆపలేని స్వేచ్చ వుంది అందినంత ఛాన్స్ వుంది

అందుకోరా పుత్ర రత్నమా నేస్తమా

జీవితానికే అర్ధం ప్రేమని

మరిచిపోదు మా యవ్వనమే

ప్రేమ అన్నదే సర్వం కాదని

చాటుతుంది మా అనుభవమే

చిలిపి వయసు వరస తనకు తెలియద

హ్యాపీ హ్యాపీ...ఓ...ఓ...

హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగా

శుభాకాంక్షలందజేయుమా మిత్రమా


తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటుంది

పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది

బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది

విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది

ప్రేమకధలు ఎప్పుడైన ఒకటే ఫ్రెండ్

ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్

upto date trend మాది total change

పాత నీతులింక మాకు నో exchange

ఫ్రెండులాంటి పెద్దవాడి అనుభవాల సారమే

శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే

కలను వదిలి ఇలను తెలిసి నడుచుకో


హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగా

శుభాకాంక్షలందజేయుమా మిత్రమా


నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా

తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా

నేల విడిచి సామైతే టైం వేస్టురా ఈ ధీమా

ముందు వెనుక గమనిస్తే విజయం నీది సుమా

రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా

తాకకుండా ఊరుకుంటే తప్పు కదా

నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా

చూడకుండా చెయ్యి వేస్తే ఒప్పు కదా

ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా

లక్ష్యమందకుండ లైఫుకర్ధమింక ఉండునా

తెగువ తెలుపు గెలుపు మనకి దొరకగా


హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగా

శుభాకాంక్షలందజేయుమా మిత్రమా

ఆపలేని స్వేచ్చ వుంది అందినంత ఛాన్స్ వుంది

అందుకోరా పుత్ర రత్నమా నేస్తమా

జీవితానికే అర్ధం ప్రేమని

మరిచిపోదు మా యవ్వనమే

ప్రేమ అన్నదే సర్వం కాదని

చాటుతుంది మా అనుభవమే

చిలిపి వయసు వరస తనకు తెలియద

హ్యాపీ హ్యాపీ...ఓ...ఓ...

హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగా

శుభాకాంక్షలందజేయుమా మిత్రమా

1, జులై 2021, గురువారం

Suswagatham : Suswagatham Navaragama Song Lyrics (సుస్వాగతం నవరాగామా.)

చిత్రం: సుస్వాగతం(1997)

సంగీతం: S.A.రాజ్ కుమార్

సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ

గానం: హరిహరన్, చిత్ర, జాస్పిండెర్ నరుల



పల్లవి: సుస్వాగతం నవరాగామా..... పలికిందిలే యదసరిగమ.... ప్రియ దరహాసమా...ప్రేమ ఇతిహాసమా.... నీ తొలి స్పర్శలో ఇంత సుఖ మైకమా.... ఇది ప్రణయాలు చిగురించు శుభ తరుణమా.. ఆ..ఆ...ఆ... ప ని స గ ని ని స చిన్నారి రాణి పువ్వా.. చిన్ని చిన్ని నవ్వులివ్వా.. నీ కోసం ప్రాణం పెట్టే చిన్నవాణ్ణి చేరవా.. సుస్వాగతం నవరాగామా చరణం:1

అంతే లేని వేగంతోని ప్రేమే వస్తుంటే నేను ఆనకట్ట వేయలేనే ఆహ్వానిస్తుంటే పట్టే తప్పే విరహంలోనే మునిగిపోతుంటే ఇంకా క్షేమంగానే జీవిస్తా నీ చేయందిస్తుంటే ఆ చేతులే నీకు పూలదండగా మెడలోన వేసి నీ జంట చేరనా నా చూపు సూత్రంగా ముడిపడగా నాజూకు చిత్రాల రాజ్యమేలనా.. మౌనమే మాని గానమై పలికే నా భావన..... ఆఆ...ఆ..ఆ.. ప ని స గ ని ని స.... సుస్వాగతం నవరాగమా చరణం:2

సూరీడున్నాడమ్మా నిన్నే చూపడానికి రేయి ఉన్నాదమ్మా కలలో నిన్నే చేరడానికి మాట మనసు సిద్ధం నీకే ఇవ్వడానికి నా కళ్లు పెదవి ఉన్నాయ్ నీతో నవ్వడానికి.. ఏనాడు చూసానో రూపురేఖలు ఆనాడే రాసాను చూపులేఖలు ఏ రోజు లేవమ్మా ఇన్ని వింతలు ఈవేళ నా ముందు ప్రేమపుంతలు ఏడు వింతలను మించే వింత మన ప్రేమే సుమా..... ఆఆ....ఆ..ఆ... ప ని స గ ని ని స... వచ్చింది పూలమాసం చిన్నవాడి ప్రేమకోసం... అందాల నీలాకాశం అందుకున్న సంబరం సుస్వాగతం నవరాగామా..... పలికిందిలే యదసరిగమ.... ప్రియ దరహాసమా...ప్రేమ ఇతిహాసమా.... నీ తొలి స్పర్శలో ఇంత సుఖ మైకమా.... ఇది ప్రణయాలు చిగురించు శుభ తరుణమా.. సుస్వాగతం నవరాగామా.....

30, జూన్ 2021, బుధవారం

Suswagatham : Ye Swapnalokala Soundarya Rashi Song Lyrics (ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి)

చిత్రం: సుస్వాగతం(1997)

సంగీతం: S.A.రాజ్ కుమార్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: బాలసుబ్రహ్మణ్యం


ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందుచేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందుచేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి తళతళ తారక మెలికల మేనక మనసున చేరెగా కలగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందుచేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి తొలిచూపు చాలంట చిట్టాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా తొలిచూపు చాలంట చిట్టాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా పదిమంది అంటుంటె విన్నాను ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో ఆ కాంతిలో ఈనాడె నా ఉదయమైనదో మధుసీమలో ఎన్ని మరుమల్లె గంధాలు మునుపెన్నడూలేని మృదువైన గానాలు మొదటి వలపు కథలు తెలుపు గేయమై తీయగా స్వరములు పాడగా ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందుచేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి మహరాణి పారాణి పాదాలకేనాడు మన్నునంటనీయక మహరాణి పారాణి పాదాలకేనాడు మన్నునంటనీయక నడిచేటి దారుల్లో నా గుండె పూబాట పరుచుకుంది మెత్తగా శాంతికే ఆలయం ఆమె నెమ్మది అందుకే అంకితం అయినదీ మది సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు చెలియ చలువ చెలిమి కొరకు ఆయువే ఆశగా తపములు చేయగా ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందుచేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి తళతళ తారక మెలికల మేనక మనసున చేరెగా కలగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందుచేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి

Suswagatham : Aalayana Harathilo Song Lyrics (ఆలయాన హారతిలో)

చిత్రం: సుస్వాగతం(1997)

సంగీతం: S.A.రాజ్ కుమార్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: బాలసుబ్రహ్మణ్యం


ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకి ఇవ్వమ్మా నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం యదర ఉంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం సూర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కల కోసం కళ్ళు మూసుకొని కలవరించెనే కంటిపాప పాపం ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం