13, జూన్ 2021, ఆదివారం

Swarna Kamalam : Kothaga Rekka Song Lyrics (కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి)

 


చిత్రం: స్వర్ణ కమలం (1988) సంగీతం: ఇళయరాజా గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, జానకి రచన: సీతారామ శాస్త్రి కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి మెత్తగా రేకు విచ్చెనా కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొండ దారి మార్చింది కొంటె వాగు జోరు కులుకులెన్నొ నేర్చింది కలికి ఏటి నీరు బండరాల హోరు మారి పంట చేల పాటలూరి మేఘాల రాగాల మాగాణి ఊగేల సిరి చిందులేసింది కనువిందు చేసింది వెదురులోకి ఒదిగిందీ కుదురులేని గాలి ఎదురులేక ఎదిగిందీ మధురగానకేళి భాషలోన రాయలేని రాసలీల రేయిలోని యమున తరంగాల కమనీయ శృంగార కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి