SwarnaKamalam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
SwarnaKamalam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, అక్టోబర్ 2021, శనివారం

Swarna Kamalam : Shiva Poojaku Song Lyrics (శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ)

చిత్రం: స్వర్ణ కమలం (1988)

సంగీతం: ఇళయరాజా

గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

రచన: సీతారామ శాస్త్రి



శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ మ్రుదు మంజుల పద మంజరి పూచిన పువ్వా సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ యతిరాజుకు జతి స్వరముల పరిమలమివ్వ సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ నటనాంజలితో బ్రతుకును తరించనీవా సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ పరుగాపక పయనించవె తలపుల నావ కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ ఎదిరించిన సుడిగాలిని జయించినావా మది కోరిన మధుసీమలు వరించి రావా పరుగాపక పయనించవె తలపుల నావ కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ పడమర పడగలపై మెరిసే తారలకై పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకె సంధ్యా సుందరి తూరుపు వేదికపై వేకువ నర్తకివై తూరుపు వెదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపించె కాంతులు చిందని నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని నిదురించిన హ్రుదయరవలి ఒంకారం కాని శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ మ్రుదు మంజుల పద మంజరి పూచిన పువ్వా సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా ఆమనికై ఎదురు చూస్తు ఆగిపోకు ఎక్కడా అవధి లేని అందముంది అవనికి నలు దిక్కులా ప్రతి రోజొక నవగీతిక స్వాగతించగా వెన్నెల కిన్నెర గానం నీకు తొడుగా పరుగాపక పయనించవె తలపుల నావ కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ లలిత చరన జనితం నీ సహజ విలాసం జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం గగన సరసి హ్రుదయములో వికసిత షతదల శోభల సువర్ణ కమలం పరుగాపక పయనించవె తలపుల నావ కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ ఎదిరించిన సుడిగాలిని జయించినావా మది కోరిన మధుసీమలు వరించి రావా స్వధర్మె మిధనం శ్రేయహ పరధర్మో భయావహ

Swarna kamalam : Andela Ravamidhi Song Lyrics ( అందెల రవమిది పదములదా.)

చిత్రం: స్వర్ణ కమలం (1988)

సంగీతం: ఇళయరాజా గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరామ్

రచన: సీతారామ శాస్త్రి


గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు: ....గురుదేవో మహేశ్వర : గురు సాక్షాత్ పర బ్రహ్మ...గురు సాక్షాత్ పర బ్రహ్మ... తస్మై శ్రీ గురవే నమ: ఓం నమో నమో నమశ్శివాయ మంగళప్రదాయగోతు రంగతే నమః శివాయ గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ.... ఓం నమో నమో నమశ్శివాయ శూలినే నమో నమః కపాలినే నమః శివాయ పాలినే విరంచితుండ మాలినే నమః శివాయ అందెల రవమిది పదములదా..... అందెల రవమిది పదములదా. అంబరమంటిన హృదయముదా.... అందెల రవమిది పదములదా. అంబరమంటిన హృదయముదా అమృత గానమిది పెదవులదా అమితానందపు ఎద సడిదా సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా అందెల రవమిది పదములదా....... మువ్వలు ఉరుముల సవ్వడులై... మెలికలు మెరుపుల మెలకువలై... మువ్వలు ఉరుముల సవ్వడులై... మెలికలు మెరుపుల మెలకువలై... మేను హర్ష వర్ష మేఘమై... మేని విసురు వాయు వేగమై..... అంగ భంగిమలు గంగ పొంగులై హావభావములు నింగి రంగులై లాస్యం సాగే లీల, రస ఝరులు జాలువారేలా జంగమమై జడ పాడగా జలపాత గీతముల తోడుగా పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా అందెల రవమిది పదములదా...... నయన తేజమే నకారమై.... మనో నిశ్చయం మకారమై.... శ్వాస చలనమే శికారమై... వాంచితార్ధమే వకారమై.. యోచన సకలము యకారమై... నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యఙం యకారం ఓం నమశ్శివాయ భావమె భవునకు భావ్యము కాగ... భరతమె నిరతము భాగ్యము కాగ...... తుహిన గిరులు కరిగేలా తాండవమాడే వేళ... ప్రాణ పంచకమె పంచాక్షరిగా పరమపధము ప్రకటించగా ఖగోళాలు పద కింకిణులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగ... అందెల రవమిది పదములదా... అంబరమంటిన హృదయముదా అమృత గానమిది పెదవులదా అమితానందపు ఎద సడిదా అందెల రవమిది పదములదా...

Swarna Kamalam : Ghallu Ghallu Song Lyrics ( ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు)

చిత్రం: స్వర్ణ కమలం (1988)

సంగీతం: ఇళయరాజా గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
రచన: సీతారామ శాస్త్రి



ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు నల్లమబ్బు చల్లని చల్లని చిరుఝల్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు నల్లమబ్బు చల్లని చల్లని చిరుఝల్లు
పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు వెల్లువొచ్చి సాగని తొలకరి అల్లర్లు
వెల్లువొచ్చి సాగని తొలకరి అల్లర్లు ఎల్లలన్నదే ఎరుగని వేగంతో వెళ్ళు ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు లయకే నిలయమై నీపాదం సాగాలి...
మలయానిలగతిలో సుమబాలగ తూగాలి వలలో ఒదుగునా విహరించే చిరుగాలి..
సెలయేటికి నటనం నేర్పించే గురువేడి తిరిగే కాలానికీ.... ఆ....ఆ....ఆ....ఆ.... తిరిగే కాలానికి తీరొకటుంది....
అదినీ పాఠానికి దొరకను అంది నటరాజస్వామి ఝాటాఝూటిలోకి చేరకుంటే
విరిచుకుపడు సురగంగకు విలువేముంది.. విలువేముంది ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు దూకేఅలలకు ఏ తాళం వేస్తారు...
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు అలలకు అందునా ఆశించిన ఆకాశం..
కలలా కరగడమా జీవితాన పరమార్ధం వద్దని ఆపలేరు.... ఆ... ఆ... ఆ... ఆ... వద్దని ఆపలేరు ఉరికే ఊహని...
హద్దులు దాటరాదు ఆశల వాహిని అలుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటె
విరివనముల పరమళముల విలువేముందీ... విలువేముందీ
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు నల్లమబ్బు చల్లని చల్లని చిరుఝల్లువెల్లువొచ్చి సాగని తొలకరి అల్లర్లుపల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు

1, ఆగస్టు 2021, ఆదివారం

Swarna Kamalam : Aakasamlo Aasala harivillu Song Lyrics (ఆకాశంలో ఆశల హరివిల్లూ)

 

చిత్రం: స్వర్ణ కమలం (1988) సంగీతం: ఇళయరాజా గాయకులు: జానకి రచన: సీతారామ శాస్త్రి


ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ అందమైనా ఆ లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా వయ్యారి వాన జల్లై దిగిరాన సంద్రంలో పొంగుతున్న అలనైపోనా సందెల్లో రంగులెన్నో చిలికేనా పిల్లగాలే పల్లకీగా, దిక్కులన్నీ చుట్టిరానా నా కోసం నవరాగాలే నాట్యమాడెనుగ ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ అందమైనా ఆ లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం స్వప్నాల సాగరాల సంగీతం ముద్దొచ్చె తారలెన్నో మెరిసే తీరం ముత్యాల తోరణాల ముఖద్వారం శోభలీలే సోయగాన చందమామ మందిరాన నా కోసం సురభోగాలె వేచి నిలిచెనుగ ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ అందమైనా ఆ లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ