19, జూన్ 2021, శనివారం

Tappuchesi Pappu Koodu : Brindavanamali song lyrics (బృందావనమాలి )

 చిత్రం:తప్పు చేసి పప్పు కూడు(2002)

సంగీతం: M.M.కీరవాణి

గానం: జేసుదాస్,చిత్ర


సమా సమగమ సమాగమగసదా నీ సా గమదని సమగస నిసదని మదగమ బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి వెన్నెల ముగ్గుల దారులు వేసినదందుకేరా లీలలు గోలలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టంలేరా బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి చరణం:1 సరి సరి నటనలతో సరాగం హాయిగా సాగాలి సిరి సిరి మువ్వలతో చిత్రంగా చిందులు వేయాలి మెరుపుల తీగలతో భుజాలే చనువుగా కలపాలి ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ఒడుపులు చూపాలి పదపదమంటూ పట్టే పట్టి ప్రేమ ఉట్టి కొల్లగొట్టి పోరా ఆ..........ఆ........... పరవశమవుతూ పైటచెంగు పాల దొంగకప్పగించుకోనా ముద్దుల జాణ ముందుకు రాగా మీగడ బుగ్గల నిగ్గులు దోచగా బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి చరణం:2 స్వరములు సరసముగా వయ్యారి చెలిమితో పాడాలి మురళిని మురిపెముగా మురారి మరి మరి ఊదాలి యమునా కెరటములా నువ్వే నా యదనే తాకాలి వరసలు కలుపుకొని వరాలే వయసుకు ఇయ్యాలి గిలగిలమంటూ పొన్న చెట్టు మీద ఉన్న చీరలందుకోరా ఆ..........ఆ........... గలగలమన్న గాజులున్న కన్నె చేతి వెన్నముద్దనీయనా మీటగ రారా యవ్వన వీణ మువ్వలు నవ్వగా పువ్వులు ఇవ్వగా బృందావనమాలి.......... ఆ..........ఆ.......... ఆ..........ఆ........... బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి