చిత్రం: వాన (2011)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: కార్తీక్
సంగీతం: కమలాకర్
ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో మైమరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ఆ ఆ ఎదుట నిలిచింది చూడు నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలీ కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ అవునో కాదో అడగకంది నా మౌనం చెలివో శిలవో తెలియకుంది నీ రూపం చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా ఆ ఆ ఎదుట నిలిచింది చూడు నిన్నే చేరుకోలేక ఎటేళ్ళిందో నా లేఖా వినేవారు లేకా విసుక్కుంది నా కేకా నీదో కాదో రాసున్న చిరునామా ఉందో లేదో ఆ చోట నా ప్రేమా వరంలాంటి శాపమేదో సొంతమైందిలా ఆ ఆ ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో మైమరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ఆ ఆ ఎదుట నిలిచింది చూడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి