12, జూన్ 2021, శనివారం

Okariki Okaru : Nuvve Naa Swasa (నువ్వే నా శ్వాస మనసున)

 చిత్రం: ఒకరికి ఒకరు

సంగీతం: M.M.కీరవాణి

సాహిత్యం: చంద్రబోస్

గానం: శ్రేయ ఘోషల్


నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష బ్రతుకైన నీతోనే చితికైన నీతోనే వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ ఓ ప్రియతమా ఓ ప్రియతమా నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష పూవుల్లో పరిమళాన్ని పరిచయమే చేశావు తారల్లో మెరుపులన్నీ దోసిలిలో నింపావు మబ్బుల్లో చినుకులన్నీ మనసులోన కురిపించావు నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా నీ జ్ఞాపకాలన్నీ ఏ జన్మలోనైనా నే మరువలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ ఓ ప్రియతమా ఓ ప్రియతమా నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష సూర్యునితో పంపుతున్నా అనురాగపు కిరణాన్ని గాలులతో పంపుతున్నా ఆరాధన రాగాన్ని ఏరులతో పంపుతున్నా ఆరాటపు ప్రవాహన్ని దారులతో పంపిస్తున్నా అలుపెరుగని హృదయ లయలని ఏ చోట నువ్వున్నా నీ కొరకు చూస్తున్నా నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ ఓ ప్రియతమా ఓ ప్రియతమా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి