29, జులై 2021, గురువారం

Amma Donga : Neetho Sayantram Song Lyrics (నీతో సాయంత్రం ఎంతో సంతోషం)

చిత్రం: అమ్మ దొంగా(1995)

సంగీతం:కోటి

సాహిత్యం: వేటూరి

గానం:  S.P.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, శైలజ



నీతో సాయంత్రం ఎంతో సంతోషం..చేసేయ్ నీ సంతకం కొంగే బంగారం పొంగే సింగారం..చూసేయ్ నా వాలకం ఓయమ్మో..ఓ వరాల గుమ్మో ఒళ్ళంతా..తిమ్మిరాయెనమ్మో బావయ్యో..బంతులాడవయ్యో ఈ రాత్రే..సంకురాతిరయ్యో ఇదోరకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం నీతో సాయంత్రం ఎంతో సంతోషం..చేసేయ్ నీ సంతకం *నీ జంటకోరే సాయంత్రము నా ఒంటిపేరే సౌందర్యము మామిళ్ళకొస్తే ఓ ఆమని కౌగిళ్ళకిచ్చా నా ప్రేమని ఆ రాధగోలేమో రాగంతీసే ఈ రాసలీలేమో ప్రాణం తీసే దరువే ఆనందం ఐనా పరువే గోవిందం యమగున్న ఇతగాడే బహు కొంటె జతగాడు చలి చుక్కల గిలిగింతకు పులకింతలు నిను పిలిచెలే కొంగే బంగారం పొంగే సింగారం..చూసేయ్ నా వాలకం నీతో సాయంత్రం ఎంతో సంతోషం..చేసేయ్ నీ సంతకం *మేనత్త కొడకా ఇది మేనక..పరుగమ్మకోసం పరిగెత్తక ఊహల్లో ఉంటే నీ ఊర్వశి...నీకెందుకంట ఈ రాక్షసి మీ కళ్ళలో మాయ మస్కా కొట్టి నేనెళ్ళనా గాలి జట్కా ఎక్కి అదిగో ఆకాశం తారాసఖితో సావాసం మన ఇద్దరి కసి ముద్దుల రస మద్దెల వింటే నిదరోయిన తొలిజన్మల సొదలిప్పుడు పొదలడిగెలే నీతో సాయంత్రం ఎంతో సంతోషం..చేసేయ్ నీ సంతకం కొంగే బంగారం పొంగే సింగారం..చూసేయ్ నా వాలకం ఓయమ్మో..ఓ వరాల గుమ్మో ఒళ్ళంతా..తిమ్మిరాయెనమ్మో బావయ్యో..బంతులాడవయ్యో ఈ రాత్రే..సంకురాతిరయ్యో ఇదోరకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి