చిత్రం : బంగారు బుల్లోడు (1993) సంగీతం : రాజ్ - కోటి గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : S.P.బాలసుబ్రహ్మణ్యం, శైలజ
మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు మనసు మారదు ఉడుకు తగ్గదు ఏందమ్మో జంటగా చిలక వాలదు ప్రేమంటేనే పేచీలు రాత్రికి మాత్రం రాజీలు గిల్లీ గిచ్చీ కజ్జాలు లవ్లీ లావాదేవీలు అబబ్బ నెమ్మది... మదన మన్మది... వలది నేడది...హా... మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు మనసు మారదు ఉడుకు తగ్గదు ఏందమ్మో జంటగా చిలక వాలదు ఎద ఉరుకులు పొదలకు ఎరుపట పొద ఇరుకులు జతలకు చెరుకట తొలి వలపులు తొలకరి రుతువట చలి పిలుపులు చెలిమికి రుజువట సొగసరి ఇటు మగసిరి అటు కలబడినది కసికాటో మనసులు ఇటు కలిసినవటు మనుగడకిది తొలిమాటు చూపుకు చూపే చుమ్మా ఊపిరి వేడేకుమ్మ ముద్దుకు ముద్దే గుమ్మ ముచ్చట నేడేనమ్మ వయసు లేడిరో... వలపు తాడుతో... నిలిపి చూడరో....హా
మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు మనసు మారదు ఉడుకు తగ్గదు ఏందమ్మో జంటగా చిలక వాలదు
రుచులడిగెను పెదవిని పెదవులు కోసరడిగెను వలపుల ఉడుకు తనువడిగెను తపనల చనువులు జతనడిగెను మదనుడు మనువులు ఉలి తగిలిన గిలి రగిలిన శిల అడిగెను నీ రూపం నిను తగిలిన సొన లెగిరినా వయసడిగెను నీ తాపం మనసే మల్లెల కోక పొంగే తేనెల కేక తొలిగా తుమ్మెద వేట జారే అల్లరి పైటా మెరుపు మేడలో... ఉరిమి చూడరో... కరుకు చుపరో...
మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు మనసు మారదు ఉడుకు తగ్గదు ఏందమ్మో జంటగా చిలక వాలదు ప్రేమంటేనే పేచీలు రాత్రికి మాత్రం రాజీలు గిల్లీ గిచ్చీ కజ్జాలు లవ్లీ లావాదేవీలు అబబ్బ నెమ్మది... మదన మన్మది... వలది నేడది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి