18, జులై 2021, ఆదివారం

Anand : Vachhe Vachhe Song Lyrics (వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా)

చిత్రం: ఆనంద్ (2004)

సంగీతం: కే ఎం రాధా క్రిష్ణన్

సాహిత్యం: వేటూరి

గానం: శ్రేయ ఘోషల్


వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్ గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయ్ తీరుస్తారా బాధ తీరుస్తారా... గాలి వాన లాలి పాడేస్తారా.... పిల్ల పాపల వాన బుల్లి పడవల వాన చదువు బాధనే తీర్చి సెలవులిచ్చిన వాన గాలి వానతో కూడీ... వేడి వేడి పకోడి ఈడు జోడు డి డి డ్డి...... తొడుండాలి ఓ లేడి ఇంద్ర ధనస్సులో తళుకు మనే ఎన్ని రంగులో ఇంతి సొగసులే తడిసినవి నీటి కోంగులో శ్రావణ మాసాల జల తరంగం జీవన రాగాల కిది ఓ మృదంగం కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్ గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయ్ వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా కోరి వచ్చిన ఈ వాన.. గోరు వెచ్చనై నాలోన ముగ్గుల సిగ్గు ముసిరేస్తే.. ముద్దు లాటలే మురిపాలా మెరిసే మెరిసే అందాలు.. తడిసే తడిసే పరువాలు గాలి వానలా పందిళ్లు... కౌగిలింతలా పెళ్లిల్లు నెమలి ఈకలా ఉలికి పడే ఎవరి కన్నుల్లో చినుకు చాటునా చిటికెలతో ఎదురు చూపులో నల్లని మేఘాలా మెరుపులందం తీరని దాహాలా వలపు పందెం కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్ గుండెలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నాయ్ తీరుస్తార బాధ తీరుస్తారా గాలి వాన లాలి పాడేస్తారా వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా ఓ.. కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్ గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయ్ తీరుస్తారా బాధ తీరుస్తారా గాలి వాన లాలి పాడేస్తారా...


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి