Anand లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Anand లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జులై 2021, ఆదివారం

Anand : Yedaloganam Song Lyircs (యదలో గానం)

చిత్రం: ఆనంద్ (2004)

సంగీతం: కే ఎం రాధా క్రిష్ణన్

సాహిత్యం: వేటూరి

గానం: హరి హారన్,చిత్ర


యదలో గానం

యదలో గానం పెదవే మౌనం

సెలవన్నాయి కళలు సెలయేరైనా కనులలో

మెరిసేలా శ్రీ రంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడితో



కట్టు కధలా ఈ మమతే కలవరింటా

కాలమొక్కటే కళలకైనా పులకరింటా

సిల కూడా చిగురించే విధి రామాయణం

విధికైనా విధి మార్చే కదా ప్రేమాయణం

మరువకుమా వేసంగి ఎండల్లో పూసేటి మల్లెలో మనసు కదా

మరువకుమా వేసంగి ఎండల్లో పూసేటి మల్లెలో మనసు కదా


శ్రీయ గౌరికి చిగురించే సిగ్గులెన్నో

శ్రీయ గౌరికి చిగురించే సిగ్గులెన్నో

పూచే సొగసులో ఎగసిన ఊసులు

మూగే మనుసులో అవి మూగవై

తడి తడి వయ్యారాలెన్నో

ప్రియా ప్రియా అన్న వేళలోన సరికి గౌరికి

Anand : Yamunatheeram Song Lyrics (యమున తీరం సంధ్య రాగం)

చిత్రం: ఆనంద్ (2004)

సంగీతం: కే ఎం రాధా క్రిష్ణన్

సాహిత్యం: వేటూరి

గానం: హరి హారన్,చిత్ర 


యమున తీరం సంధ్య రాగం యమున తీరం సంధ్య రాగం నిజమైనాయి కలలు నీల రెండు కనులలో నిలువగనే తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో యమున తీరం సంధ్య రాగం యమున తీరం సంధ్య రాగం నిజమైనాయి కలలు నీల రెండు కనులలో నిలువగనే తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకు లాగ పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా శిధిలంగ విధినైన చేసేదే ప్రేమ  హౄదయంల తననైన మరిచేదీ ప్రేమ మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మనసు కధా మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మనసు కధా

యమున తీరం సంధ్య రాగం యమున తీరం సంధ్య రాగం

ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం శిసిరంలో చలి మంటై రగిలేది ప్రేమ చిగురించె రుతువల్లే విరబూసే ప్రేమ మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మధుర కధా మరువకుమా అనందం ఆనందం ఆనందమాయేటి మధుర కధా


యమున తీరం సంధ్య రాగం యమున తీరం సంధ్య రాగం నిజమైనాయి కలలు నీల రెండు కనులలో నిలువగనే తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో యమున తీరం సంధ్య రాగం యమున తీరం సంధ్య రాగం

Anand : Nuvvena Song Lyrics (నువ్వేనా..నా నువ్వేనా..)

చిత్రం: ఆనంద్ (2004)

సంగీతం: కే ఎం రాధా క్రిష్ణన్

సాహిత్యం: వేటూరి

గానం: శ్రేయ ఘోషల్, కే ఎం రాధా క్రిష్ణన్



నువ్వేనా..నా నువ్వేనా.. నువ్వేనా..నాకు నువ్వేనా.. సూర్యుడల్లె సూది గుచ్చే సుప్రభాతమేనా మాటలాడే చూపులన్ని మౌనరాగమేనా చేరువైన దూరమైన ఆనందమేనా... చేరువైన దూరమైన ఆనందమేనా... ఆనందమేనా..ఆనందమేనా.. నువ్వేనా..నా నువ్వేనా.. నువ్వేనా..నాకు నువ్వేనా.. మేఘమల్లె సాగి వచ్చి దాహమేదో పెంచుతావు నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు కలలేనా..కన్నీరేనా.. ఆ..తేనెటీగ లాగ కుట్టి తీపి మంట రేపుతావు పువ్వులాంటి గుండెలోన దారమల్లె దాగుతావు నేనేనా..నీ రూపేనా.. చేరువైన దూరమైన ఆనందమేనా... చేరువైన దూరమైన ఆనందమేనా... ఆనందమేనా..ఆనందమేనా.. నువ్వేనా..నా నువ్వేనా.. నువ్వేనా..నాకు నువ్వేనా.. ఆ..కోయిలల్లే వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు కొమ్మగొంతులోన గుండె కొట్టుకుంటే నవ్వుతావు ఏ రాగం..ఇది ఏ తాళం.. ఆ..మసక ఎన్నెలల్లె నీవు ఇసుక తిన్నె చేరుతావు గసగసాల కౌగిలంత గుసగుసల్లె మారుతావు ప్రేమంటే..నీ ప్రేమేనా.. చేరువైన దూరమైన ఆనందమేనా... చేరువైన దూరమైన ఆనందమేనా... ఆనందమేనా..ఆనందమేనా.. నువ్వేనా..నా నువ్వేనా.. నువ్వేనా..నాకు నువ్వేనా..

Anand : Vachhe Vachhe Song Lyrics (వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా)

చిత్రం: ఆనంద్ (2004)

సంగీతం: కే ఎం రాధా క్రిష్ణన్

సాహిత్యం: వేటూరి

గానం: శ్రేయ ఘోషల్


వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్ గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయ్ తీరుస్తారా బాధ తీరుస్తారా... గాలి వాన లాలి పాడేస్తారా.... పిల్ల పాపల వాన బుల్లి పడవల వాన చదువు బాధనే తీర్చి సెలవులిచ్చిన వాన గాలి వానతో కూడీ... వేడి వేడి పకోడి ఈడు జోడు డి డి డ్డి...... తొడుండాలి ఓ లేడి ఇంద్ర ధనస్సులో తళుకు మనే ఎన్ని రంగులో ఇంతి సొగసులే తడిసినవి నీటి కోంగులో శ్రావణ మాసాల జల తరంగం జీవన రాగాల కిది ఓ మృదంగం కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్ గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయ్ వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా కోరి వచ్చిన ఈ వాన.. గోరు వెచ్చనై నాలోన ముగ్గుల సిగ్గు ముసిరేస్తే.. ముద్దు లాటలే మురిపాలా మెరిసే మెరిసే అందాలు.. తడిసే తడిసే పరువాలు గాలి వానలా పందిళ్లు... కౌగిలింతలా పెళ్లిల్లు నెమలి ఈకలా ఉలికి పడే ఎవరి కన్నుల్లో చినుకు చాటునా చిటికెలతో ఎదురు చూపులో నల్లని మేఘాలా మెరుపులందం తీరని దాహాలా వలపు పందెం కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్ గుండెలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నాయ్ తీరుస్తార బాధ తీరుస్తారా గాలి వాన లాలి పాడేస్తారా వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా ఓ.. కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్ గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయ్ తీరుస్తారా బాధ తీరుస్తారా గాలి వాన లాలి పాడేస్తారా...