చిత్రం: అన్నయ్య (2000)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: సుఖ్విందర్ సింగ్, రాధిక
బావ చందమామలు మరదలు
వీరే ఇంటికి మణి దీపాలు గుణంలో మేలిమి బంగారు,
పనుల్లో ఎవ్వరు సరిపోరు మావాళ్ల
ముందర మీవాళ్లు నిజంగా తేలిపోతారు
భామ సూర్య చంద్రులు మా వాళ్ళు
నాకు వీరే భారత లక్ష్మణాలు నేనంటే
ప్రాణం ఇస్తారు నా తోడూ నీడై వస్తారు
నా గుండె చప్పుళ్ళే వీళ్ళు నా రెండు కాళ్ళు తమ్ముళ్లు
ఎప్పుడో అప్పుడు ప్రేమలో మునగడం తప్పదమ్మా
నీకు కూడా ఎవ్వరో అతడు ఎక్కడో
ఉండటం చెప్పవయ్యా వాడి జాడ రాజా లా ఉంటాడే
ప్రేమంటె వాడే లే నచ్చితే అమ్మడు
చెప్పవే ఇప్పుడు పట్టు పట్టి జట్టు చేస్తాం
చక్కని వదినకి సయ్యానే అన్నకి వీడిపోని బంధమేద్దాం
ఉన్ అంటే కన్య రత్నాలే…
కానిద్దాం కన్యా దానాలే
వయ్యారి అక్క-చేల్లెల్లె అవుతారు తోడి-కోడల్లే
ఆనందం మీ అందం సంగీతం మా సొంతం
కొంగుతో కొట్టడం… పైతాని జార్చటం నచ్చినట్టు
గుర్తులే లే గుచ్చుతూ చూడటం గుండెనే పిండడం తీయనైన ప్రేమ తీరే
ఆ ప్రేమే స్వీకారం నీకే నా సహకారం
అక్క లే ఆకులై బావలే వక్కలై పక్క పక్క చేరుకొంది
ఉమ్మడి కాపురం ఉత్తానం అందరూ ఒక్కటిగా సాగిపోండి
భలేగా చెప్పావ్ బాబయ్య మా ఇంటి పెళ్లిళ్ల పేరయ్య
మరేమో పెద్దన్తినోదయ్యా… చెయ్యండి నన్ను తాతయ్య
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి