1, జులై 2021, గురువారం

Annayya : Saiyyare saiyya Song Lyrics (హే సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్య)

చిత్రం: అన్నయ్య (2000)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: వెన్నెలకంటి

గానం: బాలసుబ్రహ్మణ్యం



పల్లవి


హే సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్య 

హే సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్య 

భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య 

భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య 

పెంచింది నన్ను మీ అభిమానము

మీ తోడై ఉంటాను కలకాలము

సరదాగా సంతోషాలే సయ్యాటాడే సల్లాపంలో 


హే సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్య 

భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య 


చరణం 1


అన్నా తమ్ముళ్ళు ఈ అనుబంధమూ

ఇలలో అందరికీ అది ఆదర్శము

లోకం నా లోకం ఇక మీరేనురా

ప్రాణం నా ప్రాణం మీ మీదేనురా

వేళ్ళు ఒక్కటైతే అది ఉక్కు పిడికిలిరా

అందరొకటైతే కురిపించే ఈ ఆంధ్రదేశం అంతా నాదే 


హే సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్య 

భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య 


చరణం 2


మీరే నా కళ్ళు ఏ నాటికీ మీరే తమ్ముళ్ళు ఏజన్మకీ

ఎపుడూ తీరని మీ ఋణమన్నదీ

దైవం తెచ్చాడు ఈ వరమన్నదీ

అన్న కన్నుల్లో వెలిగేటి దివ్వెలివీ

అన్న గుండెల్లో పూచేటి పువ్వులివీ

నామాటే వేధంగా నడిచేటి తమ్ముళ్ళంటే మీరే 


హే సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్య 

భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి