చిత్రం:అనుమానాస్పదం(2007)
సంగీతం:ఇళయరాజా
సాహిత్యం: వంశీ
గానం: ఉన్ని కృష్ణన్, శ్రేయ ఘోషల్
నానాన..ననన..నానాన..
నానాన..ననన..నానాన..
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు..
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు..
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..ఆ..
నిదురే రాదు రాత్రంతా కలలు నేసే నాకూ..
వినగలనంటే తమాషగా ఒకటి చెప్పనా..చెప్పు..
హహహ చెప్పు..
ఇంధ్రధనుస్సు కిందా ..కూర్చునీ మాట్లాడదాం..
అలాగే చందమామతోటీ..కులాసా ఊసులాడదాం..
వింటుంటే వింతగా ఉంది..కొత్తగా ఉంది..ఏమిటీ కథనం ..
పొరపాటు..కథ కాదు..
గత జన్మలోన జాజి పూల సువాసనేమో..
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు..
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..ఆ..
నా..నా..నా..నానా..
పువ్వుల నదిలో..అందంగా నడుచుకుంటుపోనా..
ఊహల రచనే ..తియ్యంగా చేసి తిరిగి రానా..
వెన్నెల పొడిమినీ..చెంపలకి రాసి చూడనా..
సంపంగి పూల పరిమళం..వయసుకీ అద్ది ఆడనా..
అదేంటో మైకమే నను వదలినా..పొద జరగదూ నిజమో..
జడి వాన కురవాలీ..
ఎద లోయలోకి జారిపోయి దారి చూడూ..
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు..
ప్రతి.. దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..ఆ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి