Anumanaspadam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Anumanaspadam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, ఫిబ్రవరి 2025, బుధవారం

Anumanaspadam : Mallello Illesi Song Lyrics (మల్లెల్లో ఇల్లేసే చందమామా..)

చిత్రం: అనుమానాస్పదం(2007)

సాహిత్యం: వేటూరి

గానం: సాధన సర్గం, హరిహరన్

సంగీతం: ఇళయరాజా


పల్లవి:

మల్లెల్లో ఇల్లేసే చందమామా..చందమామా..చందమామా
వెన్నెల్లూ చల్లేసే చందమామా..చందమామా..చందమామా
ప్రేమకధలెన్నో విన్నావో..ప్రేమ జతలెన్నో చూసావో
మా మనవి మన్నించి..దీవించి..వెళ్ళలేవా !
మల్లెల్లో ఇల్లేసే చందమామా..చందమామా..చందమామా
వెన్నెల్లూ చల్లేసే చందమామా..చందమామా..చందమామా

చరణం 1:

కొండమల్లి పూలు చల్లి వెళ్ళకూ..గుండె గిల్లి వేదన పెంచి వెళ్ళకూ
హెచ్చు తగ్గు కాంతుల వేడి పెంచకూ..ఇచ్చి పుచ్చుకున్న వేళ ఈల వెయ్యకూ
నీ మౌనరాగాల ఆలాపనంతా ఈ చాటు మాటేనా అన్వేషణా
రోజూ నీ ప్రేమ నాటకం .. ఈ రోజు ఆడావు బూటకం
ఆడించి పాడించు నా గానలోలా.. వేచాను ఇన్నాళ్ళు వేసవల్లే !
మల్లెల్లో ఇల్లేసే చందమామా..చందమామా..చందమామా
వెన్నెల్లూ చల్లేసే చందమామా..చందమామా..చందమామా

చరణం 2:

నల్లమబ్బు చాటున నవ్వులెందుకో..తెల్ల చీర అంచున దూకుడెందుకో
అచ్చమైన ఆశకు అల్లరెందుకో..మచ్చ పడ్డ ఈడున గిల్లుడెందుకో
నీ వెన్నలే కాసే నయనాల మీదా..నీ కన్నులే చూసే ఆవేదనా
వాల్మీకి చూసే ఈ కళ్ళలోనా..సీతమ్మ చూపులు సిరివెన్నెలేనా
శాసించి పాలించు ఈ రేయిలోనా..దీపాలు పూయాలి హాయిగానే !
మల్లెల్లో ఇల్లేసే చందమామా..చందమామా..చందమామా
మల్లెల్లో ఇల్లేసే చందమామా..చందమామా..చందమామా
ప్రేమకధలెన్నో విన్నావో..ప్రేమ జతలెన్నో చూసావో
మా మనవి మన్నించి..దీవించి..వెళ్ళలేవా !
మల్లెల్లో ఇల్లేసే చందమామా..చందమామా..చందమామా
వెన్నెల్లూ చల్లేసే చందమామా..చందమామా..చందమామా

21, జులై 2021, బుధవారం

Anumanaspadam : Ninu Vethiki Vethiki Chusi Song Lyrics (నిను వెతికి వెతికి చూసి)

చిత్రం: అనుమానాస్పదం(2007)

సాహిత్యం: వేటూరి

గానం: శ్రేయ ఘోషల్, విజయ్ ఏసుదాస్

సంగీతం: ఇళయరాజా


పల్లవి:

నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు నిను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు మరుపేల వలపు వేళా మెరుపైన మెఘమాల కన్నీటి కలువపూలా వెన్నెల్లు కరుగు వేళ కనరాని చారుశీల ఓ మై లవ్ ఓ మై లవ్ (2) నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు

చరణం 1:

మన అసలు పేరు నీడా అడుగడుగు తోడుగా కధ నడుపు తమరి జాడా కనపడదు వేడుకా కరి మబ్బు చాటు తార కనిపించెనా సితార చిరు చీకటింటి నీడ వెలిగింది కంటి నిండా విరహాల ఆలయాన విరజాజి హారతేలా ముగిసింది చేదు కాలం బిగిసింది ప్రేమ గాలం చిరు కనుల ఎరుపులే వలపు గెలుపులై తెలుపనా నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు

చరణం 2:

ఉసిగొలుపు ఉడుకు తనమా చలి పొగరు చాలు లే కుదురైన కలికితనమా కసి కధలు చెప్పకే యదకెదుగు చిలిపి తనమా సొద పెట్టి చంపుతావా పొదలడుగు వలపు తనమా పెదవుల్లో దాచుతావా నిదురమ్మ పలకరింతా నివురొయె అలచినంతా హృదయాల సీమ లోనా యద గాన కోకిలేనా మన ఏడు జన్మలే ఏడు రంగులై కలిసెనా నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు నిను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు మరుపేల వలపు వేళా మెరుపైన మెఘమాల కన్నీటి కలువపూలా వెన్నెల్లు కరుగు వేళ కనరాని చారుశీల ఓ మై లవ్ ఓ మై లవ్ (2) నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు

Anumanaspadam : Prathi Dinam Nee Dharshanam Song Lyrics (ప్రతి దినం నీ దర్శనం)

చిత్రం: అనుమానాస్పదం(2007)

సాహిత్యం: వంశీ

గానం: ఉన్ని కృష్ణన్, శ్రేయ ఘోషల్ 

సంగీతం: ఇళయరాజా


పల్లవి:

నానాన..ననన..నానాన..
నానాన..ననన..నానాన..
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు..
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు..
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..ఆ..


చరణం 1:

నిదురే రాదు రాత్రంతా కలలు నేసే నాకూ..
వినగలనంటే తమాషగా ఒకటి చెప్పనా..చెప్పు..
హహహ చెప్పు..
ఇంధ్రధనుస్సు కిందా ..కూర్చునీ మాట్లాడదాం..
అలాగే చందమామతోటీ..కులాసా ఊసులాడదాం..
వింటుంటే వింతగా ఉంది..కొత్తగా ఉంది..ఏమిటీ కథనం ..
పొరపాటు..కథ కాదు..
గత జన్మలోన జాజి పూల సువాసనేమో..
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు..
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..ఆ..


చరణం 2:

నా..నా..నా..నానా..
పువ్వుల నదిలో..అందంగా నడుచుకుంటుపోనా..
ఊహల రచనే ..తియ్యంగా చేసి తిరిగి రానా..
వెన్నెల పొడిమినీ..చెంపలకి రాసి చూడనా..
సంపంగి పూల పరిమళం..వయసుకీ అద్ది ఆడనా..
అదేంటో మైకమే నను వదలినా..పొద జరగదూ నిజమో.. 
జడి వాన కురవాలీ..
ఎద లోయలోకి జారిపోయి దారి చూడూ..
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా.. 
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు..
ప్రతి.. దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..ఆ..