చిత్రం :అత్తారింటికి దారేది(2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీ మని
గానం : విజయ్ ప్రకాష్
గగనపు వీధి వీధి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నఘమే తన వాసం వనవాసం
బైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో
ఉక్కు తీగలాంటి వంటి నైజం
వీడు మెరుపులన్ని ఒక్కటైన తేజం
రక్షకుడో తక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో
శత్రువు అంటూ లేనివింత యుద్ధం
వీడి గుండె లోతు గాయమైన సిద్దం
నడిచొచ్చే నర్తన శౌరి
పరిగెత్తే పరాక్రమ శైలి
హలాహలం హరించిన ఘన హృదయుడో
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు,....
గగనపు వీధి వీధి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నఘమే తన వాసం వనవాసం
దివి నుంచి భువి పైకి భగ భగ మని కురిసేటి
వినిపించని కిరణం చప్పుడు వీడు
వడివడిగా వడగాలై దడ ధడమని జారేటి కనిపించని జడి వానేగా వీడు
శంఖంలో దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు
శోకాన్నే దాచేసె అశోకుడు వీడురో..
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు,....
తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకి
చిగురించిన చోటుని చూపిస్తాడు
తన దిశనే మార్చుకొని ప్రభవించే సూర్యుడికి
తన తూర్పు పరిచయమే చేస్తాడు
రావణుడో రాఘవుడో మనసును దోచే మాధవుడో
సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి