Attarintiki Daredi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Attarintiki Daredi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జులై 2021, శనివారం

Attarintiki Daredi : Bapu Gari Bommo Song Lyrics (అమ్మో .. బాపు గారి బొమ్మో)

చిత్రం :అత్తారింటికి దారేది(2013)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం:

గానం : శంకర్ మహదేవన్



పల్లవి -:


బొంగరాల్లాంటి కళ్ళు తిప్పింది

ఉంగరాలున్న జుట్టు తిప్పింది

గింగిరాలెత్తే నడుమువంపుల్లో నన్నే తిప్పింది

అమ్మో బాపు గారి బొమ్మో

ఓలమ్మో మల్లెపూల కొమ్మో

రబ్బరు గాజుల రంగు తీసింది

బుగ్గల అంచున ఎరుపు రాసింది

రిబ్బను కట్టిన గాలిపటంలా నన్నెగరేసిందీ.

అమ్మో దాని చూపు గమ్మో

 ఓలమ్మో మాయదారి బ్రహ్మో


పగడాల పెదవుల్తో పడగొట్టిందీ.. పిల్లా కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది

ఏకంగా ఎద పైనే నర్తించింది

అబ్బా నాట్యంలోని ముద్దర చేసి నిద్ర రాని పోయింది

అమ్మో బాపు గారి బొమ్మో

ఓలమ్మో మల్లెపూల కొమ్మో


చరణం-:1


మొన్న  మేడ మీద బట్టలారేస్తూ

కూని రాగమేదో తీసేస్తూ

పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్లా..

నిన్న కాఫీ గ్లాసు చేతికందిస్తూ

నాజూకైన నా వేళ్ళు తాకేస్తూ 

మెత్తని మత్తుల విద్యుత్ తీగై ఒత్తిడి పెంచిందే మల్లా హ..హోయ్..హ...హోయ్

కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది

ఓరగా చూసే చూపు నావైపే అనిపిస్తుంది

పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది

చీర చెంగు చివరంచుల్లో నన్నే బందీ చేసింది

పొద్దు పొద్దున్నే హల్లో అంటుందే

పొద్దు పోతే చాలు కల్లో కొస్తుందే

పొద్దస్తమానం పోయినంత దూరం గుర్తొస్తుంటుంది

అమ్మో బాపు గారి బొమ్మో

ఓలమ్మో మల్లెపూల కొమ్మో


చరణం-: 2

 ఏమాయ లోకంలోనో నన్ను మెల్లగ తోసేసింది తలుపులు మూసింది తాళం పోగొట్టేసింది

ఆ మబ్బుల అంచుల దాకా నా మనసును మోసేసింది చప్పుడు లేకుండా నిచ్చెన ప్రక్కకి లాగింది

తిన్నగ గుండెను పట్టి గుప్పిట పట్టి మూసేసింది అందమే గంధపు గాలై మళ్ళీ ఊపిరి పోసింది

తియ్యని ముచ్చటలెన్నో ఆలోచనల్లో అచ్చేసింది

ప్రేమనే కళ్లద్దాలు చూపులకే తగిలింసింది

కోసల దేశపు రాజకుమారి ఆశలు రేపిన అందాల పోరి

పూసల దండను నన్నే గుచ్చి మెల్లో  వేసిందీ

అమ్మో బాపు గారి బొమ్మో

ఓలమ్మో మల్లెపూల కొమ్మో


Attarintiki Daredi : Ninnu Chudagaane Song Lyrics (నిన్ను చూడగానే చిట్టి గుండె)

చిత్రం :అత్తారింటికి దారేది(2013)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం:

గానం : 



నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే..హొయ్...  అదేమిటే.. హయ్

నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే.. హొయ్... అదేమిటే...హ..


నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే..హొయ్...  అదేమిటే..హొయ్

నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే.. హొయ్... అదేమిటే...హొయ్


ఏమిటో ఏమ్మాయో చేసినావే కంటి చూపుతోటి,

ఏమిటో ఇదేం రోగమో అంటించినావే ఒంటి ఊపుతోటి...

ముంచే వరదలా . కాల్చే ప్రమిదలా . చంపావే మరదలా...


నిన్ను చూడగానే.... నా చిట్టి గుండె....


నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే..హొయ్...  అదేమిటే..హయ్

నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే.. హొయ్... అదేమిటే...హయ్


అంత పెద్ద ఆకాశం,  అంతులేని ఆనీలం,

నీ చేపకల్ల లోతుల్లో ఎంట నింపావే ఇరగదీసావే...

భూమిలోన బంగారం, దాగి ఉందనేది ఓసత్యం,

దాన్ని నువ్వు భూమిపైనా పెరిగేస్తూ ఇట్ట తిరుగేస్తూ  తిరగరాసావే...

ఏయ్ అలా నువ్వు చిరకట్టి చిందులేస్తే చీమలా నేను వెంటపడనా...

నావలా నువ్వు తూగుతూ నడుస్తు ఉంటే కాపలాకి నేను వెంటారాన...

కృష్ణా రాధలా నొప్పి బాధలా ఉందాం రావే మరదలా...


నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే..హొయ్...  అదేమిటే..హయ్


ఆహుమ్...ఆహుమ్...ఆహుమ్...ఆహుమ్..

ఉమ్.. అత్తలేని కోడలుత్తమురాలు ఓరమ్మా, కోడల్లేని అత్త గుణవంతురాలు ఆహుమ్.. ఆహుమ్..

కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఓరమ్మా, పచ్చి పాల మీద మీగడేదమ్మ, ఆ వేడి పాలలోన వెన్నె ఏదమ్మ.. ఆహుమ్...ఆహుమ్...



మొనాలీసా చిత్రాన్ని, గీసినోడు ఎవడైనా, ఈపాలసీస అందాన్ని చూడనేలేదు, ఇంకా ఎంలాభమ్...

కోహినూరు వజ్రాన్ని, ఎత్తుకెళ్ళినోడు రాజైన, దాని మెరుపు నీలోని దాగి వుందని తెలియలే పాపం....

ఇంతిలా నువ్వు పుట్టుకొస్తే నేను మాత్రం ఎంతని పొగిడి పాడగలను...

తెలుగు భాషలో నాకు తెలిసిన పదాలు అన్ని గుమ్మరించి ఇంత రాసినాను...

సిరివెన్నెల మూటలా వేటూరి పాటలా ముద్దుగున్నావే మరదలా....


నిన్ను చూడగానే.... నా చిట్టి గుండె...


నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే..హొయ్...  అదేమిటే..హయ్

నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే.. హొయ్... అదేమిటే...హయ్

Attarintiki Daredi : Aaradugula Bullet Song Lyrics (వీడు ఆరడుగుల బుల్లెట్టు)

చిత్రం :అత్తారింటికి దారేది(2013)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం: శ్రీ మని

గానం : విజయ్ ప్రకాష్



గగనపు వీధి వీధి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం

తరలింది తనకు తానే ఆకాశం పరదేశం

శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం

విడిచింది చూడు నఘమే తన వాసం వనవాసం


బైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి  రక్కసుడో

ఉక్కు తీగలాంటి వంటి నైజం

వీడు మెరుపులన్ని ఒక్కటైన తేజం

రక్షకుడో తక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో

శత్రువు అంటూ లేనివింత యుద్ధం 

వీడి గుండె లోతు గాయమైన సిద్దం

నడిచొచ్చే నర్తన శౌరి

పరిగెత్తే పరాక్రమ శైలి

హలాహలం హరించిన ఘన హృదయుడో


వీడు ఆరడుగుల బుల్లెట్టు

వీడు ధైర్యం విసిరిన రాకెట్టు,....


గగనపు వీధి వీధి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం

తరలింది తనకు తానే ఆకాశం పరదేశం

శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం

విడిచింది చూడు నఘమే తన వాసం వనవాసం


దివి నుంచి భువి పైకి భగ భగ మని కురిసేటి

వినిపించని కిరణం చప్పుడు వీడు

వడివడిగా వడగాలై దడ ధడమని జారేటి కనిపించని జడి వానేగా వీడు


శంఖంలో దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు

శోకాన్నే దాచేసె అశోకుడు వీడురో..


వీడు ఆరడుగుల బుల్లెట్టు

వీడు ధైర్యం విసిరిన రాకెట్టు,....


తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకి

చిగురించిన చోటుని చూపిస్తాడు

తన దిశనే మార్చుకొని ప్రభవించే సూర్యుడికి

తన తూర్పు పరిచయమే చేస్తాడు


రావణుడో రాఘవుడో మనసును దోచే మాధవుడో

సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో


వీడు ఆరడుగుల బుల్లెట్టు

వీడు ధైర్యం విసిరిన రాకెట్టు,