చిత్రం : ఔనన్నా కాదన్నా(2005)
సంగీతం: R.P.పట్నాయక్
సాహిత్యం:
గానం: K.K, ఉష
అనగనగనగా ఒక ఊర్లో ఉందో గోరింకా
తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట
ప్రేమలో లీనమై ఒక్కటయ్యే వేళలో
లోకమే ఏకమయ్యి ఒప్పుకోని రేయిలో
ప్రేమ గూడు కూలిపోయే గాలి వానలో
ప్రేమా ఓ ప్రేమా ఇది నీ మాయేనా
ప్రేమా ఓ ప్రేమా జత కలుపే మైనా
అయ్యో పాపం గోరింకా లోనే ఉందిగా
అయినా కానీ చిలకమ్మా చూడేలేదుగా
ఆశే నీరై కన్నీరై ఏరై పారినా ఆరాధించే గుండెల్లో ప్రేమే మారునా
పూత పూసినా పూజ చేసినా రాత మారునా దైవమా
అనగనగనగా ఒక ఊర్లో ఉందో గోరింకా
తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట
ప్రేమించాక విడిపోయే మాటే లేదుగా
ప్రాణం లేని నీడైనా దూరం కాదుగా
గాలికి పోయే గాలైన గదిలో దాగునా
అర్ధంకాదే ఏనాడూ అసలీ వేదన
ఏమి చేసినా ఎవ్వరాపినా ప్రేమ ఆగునా దైవమా
అనగనగనగా ఒక ఊర్లో ఉందో గోరింకా
తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట
ప్రేమలో లీనమై ఒక్కటయ్యే వేళలో
లోకమే ఏకమయ్యి ఒప్పుకోని రేయిలో
ప్రేమ గూడు కూలిపోయే గాలి వానలో
ప్రేమా ఓ ప్రేమా ఇది నీ మాయేనా
ప్రేమా ఓ ప్రేమా జత కలుపే మైనా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి