Avunanna Kaadanna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Avunanna Kaadanna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, నవంబర్ 2022, శనివారం

Avunanna Kadanna : Preminchani Cheppana Song Lyrics (ప్రేమించానని చెప్పనా)

చిత్రం: ఔనన్నా కాదన్నా(2005)

సంగీతం: R.P. పట్నాయక్

సాహిత్యం: కులశేఖర

గానం: ఉష




ప్రేమించానని చెప్పనా మనసిచ్చానని చెప్పనా నాలో ఆశలు చెప్పనా నాలో ఊసులు చెప్పనా నువ్వే నేనై చెప్పనా నీలో నేనే చెప్పనా ప్రేమించానని చెప్పనా మనసిచ్చానని చెప్పనా నాలో ఆశలు చెప్పనా నాలో ఊసులు చెప్పనా నువ్వే నేనై చెప్పనా నీలో నేనే చెప్పనా పైరగాలి నీలా తాకి పోయే వేలా ప్రేమలో పులకింతలే అనుకోనా నీలి నింగి నీరా మారిపోయే వేళ లోకమే ప్రియురాలిని అనుకోనా ఊహలోనా తేలి వేల ఊసులాడీ శ్వాస లాగ మారి గుండెలోన చేరి తీపి ఆశలే చెప్పనా.. ప్రేమించానని చెప్పనా.. మనసిచ్చానని చెప్పనా. నాలో ఆశలు చెప్పనా నాలో ఊసులు చెప్పనా దూరమైన గాని భారమైన గాని నీడల నిను వీడనే తొలిప్రేమా గాలివానే రాని గాయమైన కానీ హాయిగా చిగురించదా మన ప్రేమా గుండె ఆగి పోనీ గొంతు ఆరిపోనీ కాలమాగిపోనీ నేల చీలి పోనీ ప్రేమ పోదనీ చెప్పనా ప్రేమించానని చెప్పనా మనసిచ్చానని చెప్పనా నాలో ఆశలు చెప్పనా నాలో ఊసులు చెప్పనా నువ్వే నేనై చెప్పనా నీలో నేనే చెప్పనా.. నువ్వే నేనై చెప్పనా నీరు నేనే చెప్పనా..!








10, జులై 2021, శనివారం

Avunanna Kadanna : Anukunte Kaanidhi Song Lyrics (అనుకుంటే కానిది )

చిత్రం : ఔనన్నా కాదన్నా(2005)

సంగీతం: R.P.పట్నాయక్

సాహిత్యం: కులశేఖర



అనుకుంటే కానిది ఏమున్నది 

మనిషిఅనుకుంటే కానిది ఏమున్నది 

చలి చీమే ఆదర్శం

పని కాదా నీ దైవం 

ఆయువే నీ ధనం 

ఆశయం సాధనం

చేయరా సాహసం నీ జయం నిశ్చయం

చిలిపి బాలుడనుకుంటే చిటికెనేలు అనుకుంటే 

కృష్ణుడెత్తలేడుగా గోవర్ధనభారం 

సీత కానీ లేకుంటే చేతకాదు అనుకుంటే

విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం 

మనసుంటే కనపడదా ఏదో మార్గం 

కసి ఉంటే జతపడదా నీతో ధైర్యం 

ఓరిమే నీ బలం 

లోకమే నీ వశం 

చేయరా సాహసం....నీ జయం నిశ్చయం

రాయి లాగ కూర్చుంటే కాలు కదపలేనంటే 

ఎప్పటికి రాదుగా ఊహలకో రూపం 

బతుకు నీది అనుకుంటే భవిత నీది అనుకుంటే 

భయపడక వెలిగించెయ్ నెత్తురుతో దీపం 

యే చీకటి ఆపును రా రేపటి ఉదయం 

యే ఓటమి ఆపును ర రాగల విజయం 

కాలమే నీ పధం 

కోరికే నీ రధం 

చేయరా సాహసం....నీ జయం నిశ్చయం

2, జులై 2021, శుక్రవారం

Avunanna Kadanna : Malinam Kanidi Prema Song Lyrics (మలినం కానిది ప్రేమ )

చిత్రం : ఔనన్నా కాదన్నా(2005)

సంగీతం: R.P.పట్నాయక్

సాహిత్యం: 

గానం:  ఉష


మలినం కానిది ప్రేమ మరణం లేనిది ప్రేమ శాశ్వతమైనది ప్రేమాయా మనసెయ్ చిరునామా... 

గుండెల సందడి ప్రేమ ఆశల పందిరి ప్రేమ ఓటమి లేనిది ప్రేమ జయమే ఎపుడైనా...

గాయం చేస్తాయ్ బడా కి బదులు బంధం  


దూరం చేస్తాయి బంధం ఇంకా బలపడి పోతుంది 

ప్రేమ ను కోరేయ్ మనిషి అయిపుడు మునిగేయ్ విల్లుంది

మనసును మిత్తాయ్ ప్రేమ ఎపుడు నిలిచి ఉంటుంది అవుననా కాదన్నా ప్రేమ కోసం మళ్ళి మళ్ళి ప్రేమే పుడుతుంది...


Avunanna Kaadanna : Preminchanani Cheppana (ప్రెమించానని చెప్పనా)

చిత్రం : ఔనన్నా కాదన్నా(2005)

సంగీతం: R.P.పట్నాయక్

సాహిత్యం: 

గానం:  ఉష


ప్రెమించానని చెప్పనా

మనసిచ్చానని చెప్పనా

నాలో ఆశలు చెప్పనా

నాలో ఊసులు చెప్పనా

నువ్వే నేనై చెప్పనా

నీలో నేనె చెప్పనా

నీలో నేనె చెప్పనా


పైరగాలి నీలా తాకిపొయే వేలా

ప్రేమలో పులకింథలే అనుకొనా

నీలి నింగి నీరా మారిపొయెవేలా 

లోకమే ప్రియురాలని అనుకోనా 

ఊహలోన తేలి వేల ఊసులాడి

స్వాసలాగ మారి గుండెలోన చేరి 

తీపి ఆసలే చెప్పనా


ప్రెమించానని చెప్పనా

మనసిచ్చానని చెప్పనా

నాలో ఆశలు చెప్పనా

నాలో ఊసులు చెప్పనా


ధూరమైనా గానీ  భారమైనా గానీ

నీడలా నిను వీడనె తొలిప్రెమా 

గాలివానే రానీ  గాయమైనా కానీ

హాయిగా చిగురించధా మన ప్రేమా

గుండె ఆగిపొనీ గొంతు ఆరిపొనీ

కాలమాగిపొనీ నెలచీలిపొనీ

వీడిపొధనీ చెప్పనా


ప్రెమించానని చెప్పనా

మనసిచ్చానని చెప్పనా

నాలో ఆశలు చెప్పనా

నాలో ఊసులు చెప్పనా

Avunanna Kadanna : Gudi Gantala Navvuthavela Song Lyrics (గుడి గంటలా నవ్వుతావేల)

చిత్రం : ఔనన్నా కాదన్నా(2005)

సంగీతం: R.P.పట్నాయక్

సాహిత్యం: 

గానం: S.P.చరణ్, ఉష


గుడి గంటలా నవ్వుతావేల

తెలియదు నాకు తెలియదు

జడగంటలా ఊగుతావేల

తెలియదు నాకు తెలియదు

అసలేంటి సంగతి ఓ బాలా

తెలియదు తెలియదు తెలియదు తెలియదులే


గుడి గంటలా నవ్వుతావేల

తెలియదు నాకు తెలియదు

జడగంటలా ఊగుతావేల

తెలియదు నాకు తెలియదూ


నీ వైపల చూస్తుంటె ఆకలేయకుందీ

నీ చూపులొ బంధించె మంత్రమేమున్నదీ

నీ మాటలే వింటుంటె రోజు మారుతుందీ

నా తోడుగ నువ్వుంటె స్వర్గమె చిన్నదీ

మనసెందుకొ ఇలా మూగవోతోంది రామ

 తెలియదు

మరుమల్లె పూవులా గుప్పుమంటోంది లోన

తెలియదు


గుడి గంటలా నవ్వుతావేల

తెలియదు నాకు తెలియదు

జడగంటలా ఊగుతావేల


తెలియదు నాకు తెలియదూ


నీ నీడలొ నేనున్న చూడమంటున్నదీ

ఈ హాయి పేరేదైనా కొత్తగా ఉన్నదీ

నా కంటినె కాదన్నా నిన్ను చూస్తున్నదీ

నేనెంతగ వద్దన్న ఇష్టమంటున్నదీ

మరి దీనినే కద లోకమంటుంది ప్రేమ

తెలియదూ

అరె దూరమంటూనే చేరువౌతుంది రామ

తెలియదూ


గుడి గంటలా నవ్వుతావేల

తెలియదు నాకు తెలియదు

జడగంటలా ఊగుతావేల

తెలియదు నాకు తెలియదు

అసలేంటి సంగతి ఓ బాలా


తెలియదు తెలియదు తెలియదు తెలియదులే


గుడి గంటలా నవ్వుతావేల

తెలియదు నాకు తెలియదు

జడగంటలా ఊగుతావేల

తెలియదు ..

Avunanna Kadanna : Suvvi Suvvi Suvvalamma Song Lyrics (సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ)

చిత్రం : ఔనన్నా కాదన్నా(2005)

సంగీతం: R.P.పట్నాయక్

సాహిత్యం: 

గానం: చిత్ర, మల్లికార్జున్


సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ మాఘమాస మొచ్చేనమ్మ

సంబరాలు తెచ్చెనమ్మా గుండె గూటికి

పెళ్ళి మాట చెప్పి కోయిలమ్మ ఆశలెన్నొ రేపెనమ్మా

కొత్త కాంతి తెచ్చెనమ్మా కంటి పాపకి

చిరు నవ్వుల వానలలో మరుమల్లెల వాకిలలో

మది ఊయల లూగే నమ్మా ఊహాలలో

సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ మాఘమాస మొచ్చేనమ్మ

సంబరాలు తెచ్చెనమ్మా గుండె గూటికి


ప్రేమ కలిపింది మనసిచ్చిన నెచ్చలితో

తోడు దొరికింది ఎద నోచిన నోములతో

దూరములు దూరమయ్యే ఊహల పల్లకిలో

మాటలిక పాటలయ్యే తియ్యని పల్లవిలో

మనసంతా సంతోషం

మనసంతా ఆనందం

సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ మాఘమాస మొచ్చేనమ్మ

సంబరాలు తెచ్చెనమ్మా గుండె గూటికి


నేల మురిసింది శుభలేఖలు అందుకొని

వాన కురిసింది ఇక చల్లగ ఉండమని

వేణువులు వేదమయ్యే నీ జత చేరమని

తారకలు తాళి తెచ్చే తోడుగ సాగమని

అందుకని ఔనన్నా

వదలనుగా కాదన్నా

సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ మాఘమాస మొచ్చేనమ్మ

సంబరాలు తెచ్చెనమ్మా గుండె గూటికి

పెళ్ళి మాట చెప్పి కోయిలమ్మ ఆశలెన్నొ రేపెనమ్మా

కొత్త కాంతి తెచ్చెనమ్మా కంటి పాపకి

చిరు నవ్వుల వానలలో మరుమల్లెల వాకిలలో

మది ఊయల లూగే నమ్మా ఊహాలలో

పెళ్ళికల వచ్చెనమ్మా కన్నె సిగ్గుకి

బుగ్గ చుక్క పెట్టారమ్మా ముద్దుగుమ్మకి

Avunanna Kadanna : Anaganaga Oka Vullo Song Lyrics (అనగనగనగా ఒక ఊర్లో)

చిత్రం : ఔనన్నా కాదన్నా(2005)

సంగీతం: R.P.పట్నాయక్

సాహిత్యం: 

గానం:  K.K, ఉష


అనగనగనగా ఒక ఊర్లో ఉందో గోరింకా

తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట

ప్రేమలో లీనమై ఒక్కటయ్యే వేళలో

లోకమే ఏకమయ్యి ఒప్పుకోని రేయిలో

ప్రేమ గూడు కూలిపోయే గాలి వానలో

ప్రేమా ఓ ప్రేమా ఇది నీ మాయేనా

ప్రేమా ఓ ప్రేమా జత కలుపే మైనా


అయ్యో పాపం గోరింకా లోనే ఉందిగా

అయినా కానీ చిలకమ్మా చూడేలేదుగా

ఆశే నీరై కన్నీరై ఏరై పారినా ఆరాధించే గుండెల్లో ప్రేమే మారునా

పూత పూసినా పూజ చేసినా రాత మారునా దైవమా

అనగనగనగా ఒక ఊర్లో ఉందో గోరింకా

తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట


ప్రేమించాక విడిపోయే మాటే లేదుగా

ప్రాణం లేని నీడైనా దూరం కాదుగా

గాలికి పోయే గాలైన గదిలో దాగునా

అర్ధంకాదే ఏనాడూ అసలీ వేదన

ఏమి చేసినా ఎవ్వరాపినా ప్రేమ ఆగునా దైవమా

అనగనగనగా ఒక ఊర్లో ఉందో గోరింకా

తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట

ప్రేమలో లీనమై ఒక్కటయ్యే వేళలో

లోకమే ఏకమయ్యి ఒప్పుకోని రేయిలో

ప్రేమ గూడు కూలిపోయే గాలి వానలో

ప్రేమా ఓ ప్రేమా ఇది నీ మాయేనా

ప్రేమా ఓ ప్రేమా జత కలుపే మైనా