2, జులై 2021, శుక్రవారం

Avunu Vallidaru Istapaddaru : Yennenno Varnnalu Song Lyrics(ఎన్నెన్నో వర్ణాలు)

చిత్రం: అవును.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

సంగీతం: చక్రి

సాహిత్యం: శ్రీ హర్ష

గానం: బాలసుబ్రహ్మణ్యం , కౌసల్య


ఎన్నెన్నో వర్ణాలు... అన్నింట్లో అందాలు

ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు 

ఒక టైతే మిగిలేది తెలుపేనండీ

నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం

నాకోసం మీ ఇష్టం వదలొద్దండీ


మీ మది తొందర చేసే బాటను వీడక 

మీరు సాగిపోండిక

ఇదే ఇదే నా మాటగా పదే పదే నా పాటగా 

ఎన్నెన్నో వర్ణాలు...


నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఓ లోకం

పడలేను ఏ జోక్యం అంతేనండీ

బాగుంది మీ టేస్టూ నాకెంతో నచ్చేట్టు 

 మనసెంతో మెచ్చేట్టు మీ మీదొట్టు

అందుకే నే దిగివచ్చా వంచని నా తలవంచా స్నేహ భావమా..

కలా నిజం నీకోసమే అనుక్షణం ఉల్లాసమే..(నేనంటూ ప్రత్యేకం)


 నువ్వు అంటూ పిలుపు నాకెంతో నువ్వు దగ్గరైన తలపు

పరిచయాల మలుపు దాచేసుకున్న మాటలన్నీ తెలుపు

చిగురులే వేసేను ఈ కొమ్మ హొయలుగ

 పూవులై పూసేను ఈ జాబు చదవగ

 ఊహలేవో ఉదయించే...( నువ్వు అంటూ పిలుపు)


ఏమి ఈ భాగ్యమో నేస్తమా...

స ప ద ప సనిసా...

ఏమి ఈ భాగ్యమో నేస్తమా

నేనే నిండగా ఆ ఎండే పండగా

 ఈ వేసవే కోమలం శీతలం

ఆ చల్లని చంద్రుని మండలం

ఈ మందిరం సుందరం అందలం

 ఆ అంబరం సంబరం సంగమం

ఏమి ఈ భాగ్యమో నేస్తమా..

పొగడమాకు అతిగా చేసెయ్యమాకు పొగడపూల లతగా

 రాసినావు చాలా ఆ రాతలంత నేను ఎదిగిపోలా

 నువ్వనే వచ్చింది నా నోట చనువుగ

పిలుపులో తడబాటు ఆ మాట పలుకగ

తెలుసుకుంటే పొరబాటు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి