Avunu Valliddaru Ista Paddaru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Avunu Valliddaru Ista Paddaru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, జులై 2021, శుక్రవారం

Avunu Vallidaru Istapaddaru : Yennenno Varnnalu Song Lyrics(ఎన్నెన్నో వర్ణాలు)

చిత్రం: అవును.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

సంగీతం: చక్రి

సాహిత్యం: శ్రీ హర్ష

గానం: బాలసుబ్రహ్మణ్యం , కౌసల్య


ఎన్నెన్నో వర్ణాలు... అన్నింట్లో అందాలు

ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు 

ఒక టైతే మిగిలేది తెలుపేనండీ

నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం

నాకోసం మీ ఇష్టం వదలొద్దండీ


మీ మది తొందర చేసే బాటను వీడక 

మీరు సాగిపోండిక

ఇదే ఇదే నా మాటగా పదే పదే నా పాటగా 

ఎన్నెన్నో వర్ణాలు...


నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఓ లోకం

పడలేను ఏ జోక్యం అంతేనండీ

బాగుంది మీ టేస్టూ నాకెంతో నచ్చేట్టు 

 మనసెంతో మెచ్చేట్టు మీ మీదొట్టు

అందుకే నే దిగివచ్చా వంచని నా తలవంచా స్నేహ భావమా..

కలా నిజం నీకోసమే అనుక్షణం ఉల్లాసమే..(నేనంటూ ప్రత్యేకం)


 నువ్వు అంటూ పిలుపు నాకెంతో నువ్వు దగ్గరైన తలపు

పరిచయాల మలుపు దాచేసుకున్న మాటలన్నీ తెలుపు

చిగురులే వేసేను ఈ కొమ్మ హొయలుగ

 పూవులై పూసేను ఈ జాబు చదవగ

 ఊహలేవో ఉదయించే...( నువ్వు అంటూ పిలుపు)


ఏమి ఈ భాగ్యమో నేస్తమా...

స ప ద ప సనిసా...

ఏమి ఈ భాగ్యమో నేస్తమా

నేనే నిండగా ఆ ఎండే పండగా

 ఈ వేసవే కోమలం శీతలం

ఆ చల్లని చంద్రుని మండలం

ఈ మందిరం సుందరం అందలం

 ఆ అంబరం సంబరం సంగమం

ఏమి ఈ భాగ్యమో నేస్తమా..

పొగడమాకు అతిగా చేసెయ్యమాకు పొగడపూల లతగా

 రాసినావు చాలా ఆ రాతలంత నేను ఎదిగిపోలా

 నువ్వనే వచ్చింది నా నోట చనువుగ

పిలుపులో తడబాటు ఆ మాట పలుకగ

తెలుసుకుంటే పొరబాటు


Avunu Vallidaru Istapaddaru : Ra Rammani Ra Ra Rammani Song Lyrics (రా రమ్మని రారా రమ్మని)

చిత్రం: అవును.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

సంగీతం: చక్రి

సాహిత్యం: చంద్రబోస్

గానం: బాలసుబ్రహ్మణ్యం , కౌసల్య


రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని... 

రామచిలుక పిలిచెను ఈ వేళ 

అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా 

ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొని పోనా 

లే లెమ్మని లేలే లెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ 

మాటలకందని ఊసులతో మనసే నిండిన దోసిలితో 

ప్రేమించుకోనా ప్రతిజన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో 

విహరించనా నీ హృదయాలయంలో 

రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని... 

రామచిలుక పిలిచెను ఈ వేళ 


పెదాల్లో ప్రథమ పదము నువ్వే ఎదల్లో తరగని గని నువ్వే 

జగంలో అసలు వరము నువ్వే జనాల్లో సిసలు దొరవు నువ్వే 

అణువణువున నాలో నువ్వే అమృతమే చిలికావే 

అడుగడుగున నాతో నువ్వే అద్భుతమే చూపావే 

నిజంలో నువ్వు నిదర్లో నువ్వు సదా నావెంట ఉండగా 

ఇదేగా ప్రేమపండుగ... 


రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని... 

రామచిలుక పిలిచెను ఈ వేళ 


ఫలించే పడుచు ఫలము నీకే బిగించే కౌగిలి గిలి నీకే 

సుమించే సరస కవిత నీకే శ్రమించే చిలిపి చొరవ నీకే 

ఎదిగొచ్చిన పరువం నీకే ఏదైనా నీకొరకే 

నువు మెచ్చిన ప్రతిదీ నీకే నా యాతన నీకెరుకే 

సమస్తం నీకు సకాలంలోన స్వయానా నేను పంచనా 

సుఖిస్తాను నీ పంచన... 


రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని... 

రామచిలుక పిలిచెను ఈ వేళ 

అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా 

ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొని పోనా 

లే లెమ్మని లేలే లెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ 

మాటలకందని ఊసులతో మనసే నిండిన దోసిలితో 

ప్రేమించుకోనా ప్రతిజన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో 

విహరించనా నీ హృదయాలయంలో...

Avunu Vallidaru Istapaddaru : Vennello Hai Hai Song Lyrics(వెన్నెల్లో హాయ్ హాయ్.)

చిత్రం: అవును.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

సంగీతం: చక్రి

సాహిత్యం: వంశీ

గానం: చక్రి



పల్లవి: హాయ్ హాయ్......హాయ్ హాయ్... వెన్నెల్లో హాయ్ హాయ్.... మల్లెల్లో హాయ్ హాయ్.... వరాల జల్లే కురిసే..... తప్పెట్లు హాయ్ హాయ్.... ట్రంపెట్లు హాయ్ హాయ్..... ఇవాళ మనసే మురిసే.... మే నెల్లో ఎండ హాయ్....... ఆగస్టులో వాన హాయ్...... జనవరిలో మంచు హాయ్...... హాయ్ రామా హాయ్ హాయిగుంటే చాలునండి వెయ్యిమాటలెందుకండి వెన్నెల్లో హాయ్ హాయ్..... మల్లెల్లో హాయ్ హాయ్..... వరాల జల్లే కురిసే..... తప్పెట్లు హాయ్ హాయ్..... ట్రంపెట్లు హాయ్ హాయ్.... ఇవాళ మనసే మురిసే.... మే నెల్లో ఎండ హాయ్.... ఆగస్టులో వాన హాయ్.... జనవరిలో మంచు హాయ్..... హాయ్ రామా హాయ్ హాయిగుంటే చాలునండి వెయ్యిమాటలెందుకండి చరణం:1 కనుల ఎదుట కలల ఫలము నిలిచినది తందానా సుధ చిందేనా కలలు కనని వనిత ఎవరో మనకు ఇక తెలిసేనా మది మురిసేనా తనను ఇక ఎల్లాగైనా కళ్ళారా నే చూడాలి పగలు మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలి మధుర లలనా మదన కొలనా కమల వదనా అమల సదనా వదల తరమా మదికి వశమా చిలిపితనమా చిత్రమైన బంధమాయె అంతలోన అంతులేని చింతనా అంతమంటూ ఉన్నదేనా వెన్నెల్లో హాయ్ హాయ్....... మల్లెల్లో హాయ్ హాయ్...... వరాల జల్లే కురిసే...... తప్పెట్లు హాయ్ హాయ్....... ట్రంపెట్లు హాయ్ హాయ్..... ఇవాళ మనసే మురిసే.... మే నెల్లో ఎండ హాయ్..... ఆగస్టులోవాన హాయ్.... జనవరిలో మంచు హాయ్..... హాయ్ రామా హాయ్ హాయిగుంటే చాలునండి వెయ్యిమాటలెందుకండి చరణం:2 గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలి ఏం చెయ్యాలి అసలు తను ఎల్లా ఉందో ఏం చేస్తుందో ఏమోలే స్పెషలు మనిషైనా కూడా మనకేముంది మామూలే కళలు తెలుసా ఏమో బహుశా కవిత మనిషా కలల హంస మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతంటూ ఉంది మదిని లాగుతున్నది ఎంత ఎంత వింతగున్నది..... వెన్నెల్లో హాయ్ హాయ్...... మల్లెల్లో హాయ్ హాయ్..... వరాల జల్లే కురిసే.... తప్పెట్లు హాయ్ హాయ్..... ట్రంపెట్లు హాయ్ హాయ్.... ఇవాళ మనసే మురిసే.... మే నెల్లో ఎండ హాయ్..... ఆగస్టులో వాన హాయ్.... జనవరిలో మంచు హాయ్.... హాయ్ రామా హాయ్ హాయిగుంటే చాలునండి వెయ్యిమాటలెందుకండి వెన్నెల్లో హాయ్ హాయ్..... మల్లెల్లో హాయ్ హాయ్..... వరాల జల్లే కురిసే..... తప్పెట్లు హాయ్ హాయ్..... ట్రంపెట్లు హాయ్ హాయ్.... ఇవాళ మనసే మురిసే...... మే నెల్లో ఎండ హాయ్... ఆగస్టులో వాన హాయ్... జనవరిలో మంచు హాయ్.... హాయ్ రామా హాయ్ హాయిగుంటే చాలునండి వెయ్యిమాటలెందుకండి