చిత్రం : బృందావనం(1992 )
సంగీతం : మాధవపెద్ది సురేష్
గీతరచయిత : వెన్నెలకంటి
నేపధ్య గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
పల్లవి :
ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని
ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని
ఆ రోజు నారాజు చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని
ఆ రోజు నారాజు చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని
చరణం : 1
ఆ రోజు జాబిల్లీ పగలే వచ్చింది
ఈరోజు జాజుల్లో సెగలే తెచ్చింది
ఆ రోజు ఓ చూపూ వలలే వేసింది
ఈ రోజు మాపుల్లో కలలే తోచింది
కన్నులే వెన్నలాయే వన్నెలే వెన్నెలాయే
ముద్దలా ముచ్చటాయే నిద్దరే పట్టదాయే
ఈ రోజే నాకు తెలిసింది ఈ చిత్రాలే చేసింది లవ్వని
మధుపత్రాలు రాసింది లవ్వనీ
ఆ రోజు నారాజు చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని
ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని
చరణం : 2
ఆ రోజు కలలోన తొణికే ఆ ప్రేమ
ఈ రోజు ఇలలోన నిజమే చేద్దామా
ఆరోజు మెరిసింది అందం చిరునామా
ఈ రోజు కలిసింది జతగా ఈ భామ
గుండెలో అల్లరాయే ఎండలే చల్లనాయే
ఆశలే వెల్లువాయి ఊసులే చల్లిపోయే
ఈ రోజే నాకు తెలిసింది రాగాలు రేపింది లవ్వనీ
అనురాగాలు చూపింది నువ్వని
ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి