31, జులై 2021, శనివారం

Brindavanam : Madhurame Sudhaganam Song Lyrics (మధురమే సుధాగానం)

చిత్రం : బృందావనం(1992 )

సంగీతం : మాధవపెద్ది సురేష్

గీతరచయిత : వెన్నెలకంటి

నేపధ్య గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి



పల్లవి :

మధురమే సుధాగానం.. మనకిదే మరోప్రాణం  మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం  మధురమే సుధాగానం.. మనకిదే మరోప్రాణం  మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం 

చరణం : 1

చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా.. కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా  శతకోటి భావాలను పలుకు ఎద మారున.. సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా.. మధురమే సుధాగానం.. మనకిదే మరోప్రాణం  మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం 

చరణం : 2

వేవేల తారలున్నా నింగి ఒకటే కదా.. ఎన్నెన్ని దారులున్నా గమ్యమొకటే కదా.. ఎనలేని రాగాలకూ నాదమొకటే కదా.. అనుభూతులెన్ని ఉన్నా హౄదయమొకటే కదా.. మధురమే సుధాగానం.. మనకిదే మరోప్రాణం  మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం  మధురమే సుధాగానం.. మనకిదే మరోప్రాణం  మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం  మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి