3, జులై 2021, శనివారం

Chandamama : Nalo Voohalaku Song Lyrics (నాలో ఊహలకు నాలో ఊసులకు )

చిత్రం.      :  చందమామ  (2007)

సంగీతం   : కె.ఎం.రాధా కృష్ణన్

గానం       : ఆశా భోంస్లే

రచన       : అనంత్  శ్రీరామ్  


నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు

పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు


కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే

పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే

శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమవుతుందిలా

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు


మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతు

మనస్సిలా మరుగుతూ అవధులే కరుగుతు

నిన్ను చూస్తూ  ఆవిరవుతూ అంతమవ్వాలనే

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు

పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి