చిత్రం: దళపతి (1991)
రచన: రాజశ్రీ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఇళయరాజా
పల్లవి :
సుందరి నేనే నువ్వంట... చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంతా... జన్మకే తోడై నేనుంట గుండెలో నిండమంటా నీడగా పాడమంట నా సిరి నీవేనట... సుందరి నేనే నువ్వంట... చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంతా... జన్మకే తోడై నేనుంట
చరణం:1
అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా మధురాల మధువులు చింది చల్లని ప్రేమే మాయమా ఆ... రేపవలు నిద్దరలోను ఎదనీ తోడి పోదును యుద్ధాన ఏమైనా నా ఆత్మే నిన్నే చేరును ఎద తెలుపు ఈ వేళ ఏల ఈ శోధన జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన నాలో ప్రేమే మరిచావు ప్రేమే నన్నే గెలిచేనే కానుకే ఇచ్చా మనసంతా... జన్మకే తోడై నేనుంట సుందరి నేనే నువ్వంట... చూడని నీలో నన్నంట గుండెలో నిండమంటా నీడగా పాడమంటనా సిరి నీవేనట...
సుందరి నేనే నువ్వంట... చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంతా... జన్మకే తోడై నేనుంట
చరణం:2
పువ్వులే ముళ్ళై తోచు నీవే నన్ను వీడితే ఊహలే పూలై పూచు నీ ఎదమాటున చేరితే మాసాలు వారాలౌను నీవు నేను కూడితే వారాలు మాసాలౌను బాటే మారీ సాగితే పొంగు నీ బంధాలే నీ దరిచేరితే గాయాలు ఆరేను నీ ఎదుటవుంటే నీవే కదా నా ప్రాణం ఇవే కదా నా లోకం సుందరి నేనే నువ్వంట... చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంతా... జన్మకే తోడై నేనుంట గుండెలో నిండమంటా నీడగా పాడమంట నా సిరి నీవేనట...
సుందరి నేనే నువ్వంట... చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంతా... జన్మకే తోడై నేనుంట
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి