చిత్రం: నిరీక్షణ (1986)
రచన: ఆచార్య ఆత్రేయ
గానం: K.J.ఏసుదాస్
సంగీతం: ఇళయరాజా
సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే పూసిందే ఆ పూలమాను నీ దీపంలో కాగిందే నా పేద గుండె నీ తాపంలో ఊగానే నీ పాటలో ఉయ్యాలై ఉన్నానే ఈనాటికీ నేస్తాన్నై ఉన్నా ఉన్నాదొక దూరం ఎన్నాళ్ళకు చేరం తీరందీ నేరం సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే తానాలే చేశాను నేను నీ స్నేహంలో ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే ఉందా కన్నీళ్ళకు అర్థం ఇన్నేళ్ళుగ వ్యర్థం చట్టందే రాజ్యం సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి