చిత్రం :దేవాంతకుడు (1984)
సంగీతం : J.V.రాఘవులు
సాహిత్యం :
గానం: బాలసుబ్రహ్మణ్యం, శైలజ
స్వస్తిశ్రీ చాంద్రమాన రుధిరోద్గారి నామ సంవత్సరం మార్గశిర పౌర్ణమి బుదవారం పుష్యమి నక్షత్రయుక్త శుభలగ్నమందు చెల్లెమ్మకు పెళ్ళంట… అన్నయ్యకు సంబరమంట చెల్లెమ్మకు పెళ్ళంట… అన్నయ్యకు సంబరమంట ఏ ఇంటికి ఇల్లాలైనా… నా కంటికి పాపేనంటా చెల్లెమ్మకు పెళ్ళంట… అన్నయ్యకు సంబరమంట ఏ ఇంటికి ఇల్లాలైనా… నా కంటికి పాపేనంటా చెల్లెమ్మకు పెళ్ళంట… అన్నయ్యకు సంబరమంట ఎదపై ఆడిన నా చిట్టి చెల్లి… వధువుగ మారే సమయంలో ఎదపై ఆడిన నా చిట్టి చెల్లి… వధువుగ మారే సమయంలో నింగినంతగా పందిరి వేసి… నేల నిండుగా వేదిక వేసి పూలరథంలో పంపిస్తా, ఆఆ… నలుగురిలో నే గర్విస్తా చెల్లెమ్మకు పెళ్ళంట… అన్నయ్యకు సంబరమంట ఆ దేవుడు దిగి వస్తే… వరమొక్కటి ఇమ్మంటా ఆ దేవుడు దిగి వస్తే… వరమొక్కటి ఇమ్మంటా మరు జన్మనేదే ఉంటే… ఈ అన్నే కావాలంటా ఆ దేవుడు దిగి వస్తే… వరమొక్కటి ఇమ్మంటా కొంగుముడితో నే వెళ్ళిపోతే… ఏమౌతుందో నీ పేద మనసు కొంగుముడితో నే వెళ్ళిపోతే… ఏమౌతుందో నీ పేద మనసు ఎక్కడ ఉన్నా, నేనేమైనా… కోరేదేమిటి నీ బాగు కన్నా పెద్ద మనసుతో దీవిస్తున్నా, ఆఆ… వయసున నీకు చిన్నైనా చెల్లెమ్మకు పెళ్ళంట… అన్నయ్యకు సంబరమంట ఏ ఇంటికి ఇల్లాలైనా… నా కంటికి పాపేనంటా చెల్లెమ్మకు పెళ్ళంట… అన్నయ్యకు సంబరమంట
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి