18, జులై 2021, ఆదివారం

Godavari : Uppongele Godavari Song Lyrics ( ఉప్పొంగెలే గోదావరీ)

చిత్రం: గోదావరి (2008)

సంగీతం: కే ఎం రాధా క్రిష్ణన్

సాహిత్యం: వేటూరి

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం


పల్లవి: ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరీ మా సీమకే చీనాంబరి.. వెదలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి.. శబరి కలిసిన గోదారీ రామ చరితకే పూదారి వేసై చాప తోసై నావ బార్సై వాలుగా.. చుక్కానే చూపుగా.. బ్రతుకుతెరువు ఎదురీతేగా.. ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరీ మా సీమకే చీనాంబరీ.. చరణం 1: సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం.. వేసే అట్లు వేయంగానె లాభసాటి బేరం.. ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం.. ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ.. నది ఊరేగింపులో.. పడవమీద రాగా.. ప్రభువు తాను కాగా.. ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరీ మా సీమకే చీనాంబరి.. చరణం 2: గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు.. లంకానాధుడింటా ఆగనంటు పండు కొరుకు.. చూసే చూపు ఏం చెప్పింది సీతా కాంతకీ.. సందేహాల మబ్బే పట్టె చూసే కంటికీ.. లోకం కాని లోకం లోన ఏకాంతాల వలపు.. అల పాపికొండలా.. నలుపు కడగలేక.. నవ్వు తనకు రాగా.. ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరీ మా సీమకే చీనాంబరి.. వెదలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి.. శబరి కలిసిన గోదారీ రామ చరితకే పూదారి వేసై చాప తోసై నావ బార్సై వాలుగా.. చుక్కానే చూపుగా.. బ్రతుకుతెరువు ఎదురీతేగా.. ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరీ మా సీమకే చీనాంబరీ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి