19, జులై 2021, సోమవారం

Bhairava Dweepam : Ghataina Prema Song Lyrics (ఘాటైన ప్రేమ ఘటన..)

చిత్రం: భైరవ ద్వీపం సంగీతం:మాదవపెద్ది సురేష్ , సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 

ఘాటైన ప్రేమ ఘటన.. ధీటైన మేటి నటన అందంగా అమరిందిలే.. ఇక ఆనందం మిగిలిందిలే నిజమెరుగవే పసిచిలక ఘాటైన ప్రేమ ఘటన..    ధీటైన మేటి నటన   ఆనందం చిందించెలే.. నా అందం నీ వశమాయెలే తెరమరుగిక తొలగునులే

కోరుకున్న వాడే తగువేళ చూసి జతగూడే..       సుముహూర్తం ఎదురైనది.. అందమైన ఈడే అందించమంటూ దరిచేరే..      సందేశం  ఎద విన్నది.. లేనిపోని లోని శంక..   మానుకోవె బాలిక ఏలుకోవా గోరువంక     లేత నీలి కానుక కులుకా  రసగుళిక  కళలొలుక      తగు తరుణము దొరికెనుగా ఘాటైన ప్రేమ ఘటన..      ధీటైన మేటి నటన     ఆనందం చిందించెలే నా అందం నీ వశమాయెలే      తెరమరుగిక తొలగునులే

పూజలన్నీ పండె పురివిప్పి నేను జతులాడి అనురాగం శృతి చేయగా మోజులన్నీ పిండే మగతోడు చేరు ఈనాడు            సుఖభోగం  మొదలౌనుగా ఊసులన్నీ మాలగా.. పూసగుచ్చివేయనా.. రాచకన్నెనేలగా.. దూసుకొచ్చి వాలనా.. కరిగా.. తొలకరిగా.. రసఝరిగా అణువణువొక  చినుకవగా ఘాటైన ప్రేమ ఘటన..   ధీటైన మేటి నటన అందంగా అమరిందిలే ఇక ఆనందం మిగిలిందిలే.. నిజమెరుగవే పసిచిలక ఘాటైన ప్రేమ ఘటన..    ధీటైన మేటి నటన    ఆనందం చిందించెలే..    నా అందం నీ వశమాయెలే తెరమరుగిక తొలగునులే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి