చిత్రం : హిట్లర్(1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, అనుపమ, రేణుక
కన్నీళ్లకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నా ఇలా నిన్నే చూడగా ఓ ... అన్ని నువ్వై భారం మోయగా ఈ బరువే నీ చదువై ఎదిగిన పసి కూన ఓ ఓ ఓ ... ఓ ఓ ఓ ... ఓ ఓ ... ఓ ఓ ఓ ... కన్నీళ్లకే అమ్మ లోని లాలన నాన్న లోని పాలన అందిపుచ్చుకున్న ఈ అన్న నీడలో కొమ్మ చాటు పూవులై కంచె చాటు పైరులై చిన్ని పాపలందరూ ఎదుగు వేళలో ముసిరే నిశిలో నడిచే దిశలో నెత్తురుతో నిలిపావే ఆరని దీపాన్ని ఓ ఓ ఓ ... ఓ ఓ ఓ ... ఓ ఓ ఓ ... ఓ ఓ ఒ. .. కన్నీళ్లకే దారి చూపు సూర్యుడా జోల పాడు చంద్రుడా నీవు కంట నీరు పెడితే నిలువలేమురా నీరు కాదే అమ్మలు తీరుతున్న ఆశలు ఇన్నినాళ్ళ భారమంతా కడుగుతున్నవి ఒడిలో ఒదిగి రుణమై ఎదిగి మరు జన్మ నిను కని పెంచే అమ్మవుతామయ్య నీ నవ్వే వెన్నెల వెలుగమ్మ నా యదలో కాంతుల కొలువమ్మ ఏ దైవమో దీవించాడు మా అన్నగా దిగి వచ్చాడు ఏ జన్మలో రుణమో తీర్చగా ఓ ... మా కోసమే ప్రాణం పంచగా ఏ పుణ్యం మా కోసం ఈ వరమిచ్చిందో నీ నవ్వే వెన్నెల వెలుగమ్మ నా యదలో కాంతుల కొలువమ్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి