చిత్రం:రాజా విక్రమార్క(1990)
సంగీతం:రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం
ఏరారోయ్ సూర్యున్ని జాబిలి వాటేసుకుంది ఏరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది ఏరారోయ్ సూర్యున్ని జాబిలి వాటేసుకుంది ఏరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది తాగినోళ్ళ తందనాలు వాగకుంటే వందనాలు తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కిపోతారు ఏరారోయ్ సూర్యున్ని జాబిలి వాటేసుకుంది ఏరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది ఓరరెరె.. పల్లవొచ్చె నా గొంతులో ఎల్లువొచ్చె నా గుండెలో పుట్టుకొచ్చె ఎన్నెన్ని రాగాలో మందు కొట్టి ఒళ్ళెందుకు చిందులేసే తుళ్ళింతలో కైపులోన ఎన్నెన్ని కావ్యాలో రేపన్నదే లేదని ఉమరు కయ్యాము అన్నాడురా నేడన్నదే నీదని ధూళిపాటి చలమయ్య చెప్పాడురా రసవీరా కసితీరా నీరింటి చేపల్లె గాలింటి గువ్వల్లె నే తేలిపోతాను ఏరారోయ్ సూర్యున్ని జాబిలి వాటేసుకుంది ఏరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది దేవదాసు తాగాడురా వేదమేదో చెప్పాడురా విశ్వదాభి రాముడ్ని నేనేరోయ్ ఒంటికేమో ఈడొచ్చెరా ఇంటికొస్తే తోడేదిరా పుత్తడంటి పూర్ణమ్మ యాడుందో శృంగార శ్రీనాధుడు ఎన్నెన్నో సీసాలు చెప్పాడురా సంసార స్త్రీనాధుడై ఎన్నెన్నో వ్యాసాలు రాస్తానురా ప్రియురాలా జవరాలా నీ చేప కన్నల్లె నీ కంటిపాపల్లె నేనుండిపొతాలే ఏరారోయ్ సూర్యున్ని జాబిలి వాటేసుకుంది ఏరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది తాగినోళ్ళ తందనాలు వాగకుంటే వందనాలు తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కిపోతారు ఏరారోయ్ సూర్యున్ని జాబిలి వాటేసుకుంది ఏరారోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది ఏరారోయ్..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి