చిత్రం: ఇంద్రధనస్సు(1977 )
సంగీతం : కేవీ మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం
నేనొక ప్రేమ పిపాసిని - నీవొక ఆశ్రమవాసివి నేనొక ప్రేమ పిపాసిని - నీవొక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని - నీవొక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని.. చరణం 1: తలుపు మూసినా తలవాకిటనే - పగలు రేయి నిలుచున్నా పిలిచి పిలిచీ బదులేరాక - అలసి తిరిగి వెళుతున్నా తలుపు మూసినా తలవాకిటనే - పగలు రేయి నిలుచున్నా పిలిచి పిలిచీ బదులేరాక - అలసి తిరిగి వెళుతున్నా నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని.. చరణం 2: పూట పూట నీ పూజ కోసమని - పువ్వులు తెచ్చాను ప్రేమభిక్షను పెట్టగలవని - దోసిలి ఒగ్గాను నీ అడుగులకు మడుగులోత్తగా - ఎడదను పరిచాను నీవు రాకనే అడుగు పడకనే - నలిగిపోయాను నేనొక ప్రేమ పిపాసిని.. చరణం 3: పగటికి రేయి - రేయికి పగలు - పలికే వీడ్కోలు సెగ రేగిన గుండెకు చెబుతున్నా - నీ చెవిన పడితే చాలు నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు నను వలచావని తెలిపేలోగా - నివురైపోతాను..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి