31, జులై 2021, శనివారం

Maro Charithra : Ye Teega Puvvuno Song Lyrics (ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది)

చిత్రం. : మరో చరిత్ర (1976)

సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ



ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో అప్పుడిన్న..అర్ధం కాలేదా ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది

మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది ఆహ అప్పుడియ..పెద్ద అర్దమైనట్టు భాష లేనిది బంధమున్నది మన ఇద్దరినీ జత కూర్చినది

ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది ఏ నీ రొంబ అళహరిక్కే ఆ రొంబ అంటే ఎల్లలు ఏవి ఒల్లలన్నది నీదీ నాదొక లోకమన్నది

ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తొలి చూపే నను నిలవేసినది మరుమాపై అది కలవరించినది నల్ల పొన్ను అంటే నల్ల పిల్లా మొదటి కలయికే ముడి వేసినది తుదిదాకా ఇది నిలకడైనది

ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో అప్పుడిన్న..అర్ధం కాలేదా ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి