చిత్రం:కలిసుందాం రా(2000)
సంగీతం: S.A.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: హరిహరన్, సుజాత
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదేపదే పిలిచె ఈ గానం
ప్రతిచోట నీకోసం వెతుకుతుండగా
కనుల్లోన నీరూపం వెలుగుతుండగా
మనస్సంతా మల్లెల జలపాతం
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదేపదే పిలిచె ఈ గానం
తరుముతు వచ్చే తీయని భావం ప్రేమో ఏమో ఎలాచెప్పడం
తహ తహ పెంచే తుంటరి దాహం తప్పో ఒప్పో ఏం చెయ్యడం
ఊహల్లో ఉయ్యలూపే సంతోషం రేగేలా
ఊపిరిలో రాగం తీసే సంగీతం సాగేలా
అలలై పిలిచే ప్రణయ సుప్రభాతం
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదేపదే పిలిచె ఈ గానం
వివరివరంటూ ఎగిసిన ప్రాయం నిన్నే చూసి తలొంచే క్షణం
నిగనిగమంటూ నీ నయగారం హారం వేసి వరించే క్షణం
స్నేహాల సంకెళ్లే అల్లేసే కౌగిల్లో
పారాణి పాదాలె పారాడే గుండెల్లో
నడకే మరిచీ శిలయ్యింది కాలం
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదేపదే పిలిచె ఈ గానం
ప్రతిచోట నీకోసం వెతుకుతుండగా
కనుల్లోన నీరూపం వెలుగుతుండగా
మనస్సంతా మల్లెల జలపాతం
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదేపదే పిలిచె ఈ గానం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి