చిత్రం:మా అన్నయ్య(2000)
సంగీతం: S.A.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: హరిహరన్
పల్లవి:
నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
కలహంస లాగ రావే
కలలన్ని తీర్చిపోవే
నా ప్రేమ శృతి నీవే
ప్రతి జన్మ జత నీవే
నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
చరణం:1
దేవుడు కనబడి వరమిస్తే
వేయి జన్మలు ఇమ్మంటా
ప్రతి ఒక జన్మ నా కంటే
నిన్ను మిన్నగా ప్రేమిస్తా
దేవతే నీవని గుడి కడతా
జీవితమంతా పుజిస్తా
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
చరణం:2
ప్రేమకు మరుపే తెలియదులే
మనసు ఎన్నడు మరువదులే
తెరలను తీసి నను చూడు
జన్మజన్మకు నీ తోడు
వాడనిదమ్మా మన వలపు
ఆగనిదమ్మా నా పిలుపు
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
కలహంస లాగ రావే
కలలన్ని తీర్చిపోవే
నా ప్రేమ శృతి నీవే
ప్రతి జన్మ జత నీవే
నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి