చిత్రం: లక్ష్మి నరసింహ (2004)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శ్రేయ ఘోషల్
సంగీతం: మణి శర్మ
పల్లవి:
అందంలో ఆంధ్రా కోస్తా
నీకే నా బందోబస్తా
అంతేదో చూస్తా జోరుగా
అందాలే చందాలేస్తా
మందార గంధాలేస్తా
రాసిస్తా నన్నే తేరగా
కస్సుల బుస్సుల కారప్పొడి
కసే కసమిస నా దోపిడి
కిస్సుకి మిస్సుకి వెంటే పడి
కథే నడిపితే నీకే పిడి
నచ్చావులే మెచ్చానులే
జివ్వు జివ్వంటూ కవ్వించుకుంటాను రావే మరి
కుడికాలే కదిలంది
కుడికన్నే అదిరింది హోయ్
అందంలో ఆంధ్రా కోస్తా
నీకే నా బందోబస్తా
అంతేదో చూస్తా జోరుగా
చరణం:1
మత్తెక్కే అందాలా మహిళామణి
చెయ్యవే హాయిగా పూబోణి
కమ్ముకుంటే పాడుతుంది కళ్యాణి
సయ్యంటూ కలిపాను చేయి చేయీ
ఎత్తులే వేయకు అబ్బాయి
అందుకైతే మోగనివ్వు సన్నాయి
గుచ్చుకుంటే నీకు ఈడు ముల్లు
చిట్టి చెంపబుగ్గే నాకు చెంపగిల్లు
కట్టుకున్నాక పుట్టేది ఆహా హైలెస్సులే
కుడికాలే కదిలంది
కుడికన్నే అదిరింది హాయ్
అందంలో ఆంధ్రా కోస్తా
నీకే నా బందోబస్తా
అంతేదో చూస్తా జోరుగా
చరణం:2
భామా నీ బాడీకి బందోబస్తూ
సిగ్గులే దోచితే శ్రీరస్తూ
కంటితోనే ఒంటి తేనే లాగేస్తూ
పొమ్మంటే రమ్మంటూ నీతో చిక్కూ
గాలిలో ముద్దుల మ్యూజిక్కూ
లాహిరాల కళ్ళతోటి మ్యాజిక్కూ
జబ్బ చూస్తే పచ్చి దెబ్బ పండు
నువ్వు నవ్వుతుంటే నాకు మల్లెచెండూ
ప్రేమ కోరింది నాతోటి నీ పెళ్లి పేరంటమే
కుడికాలే కదిలంది
కుడికన్నే అదిరింది
అందంలో ఆంధ్రా కోస్తా
నీకే నా బందోబస్తా
అంతేదో చూస్తా జోరుగా
అందాలే చందాలేస్తా
మందార గంధాలేస్తా
రాసిస్తా నన్నే తేరగా
కస్సుల బుస్సుల కారప్పొడి
కసే కసమిస నా దోపిడి
కిస్సుకి మిస్సుకి వెంటే పడి
కథే నడిపితే నీకే పిడి
నచ్చావులే మెచ్చానులే
జివ్వు జివ్వంటూ కవ్వించుకుంటాను రావే మరి
కుడికాలే కదిలంది
కుడికన్నే అదిరింది హోయ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి