Lakshmi Narasimha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Lakshmi Narasimha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, ఏప్రిల్ 2022, బుధవారం

Lakshmi Narasimha : Marumalli Jabilli Song Lyrics (మరుమల్లి జాబిల్లి )

చిత్రం: లక్ష్మి నరసింహ (2004)

సాహిత్యం: చంద్రబోస్

గానం: శంకర్ మహదేవన్,మురళీధర్,శ్రీ వర్ధిని

సంగీతం: మణి శర్మ



మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి మన్మధుని రాఘవుని కలబోతే బావ అని మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి మన్మధుని రాఘవుని కలబోతే బావ అని ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళి ఇంటిపేరు మర్చే పెళ్ళి జంటనడక పెళ్ళి బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవమయి జరుగుతున్న పెళ్ళి బహుమానంగా ఆశీస్సులనే అడుగుతున్న పెళ్ళి దేవుళ్ళు దేవతలు కొలువయిలేరు కొవెలలో బంధువులై చుట్టాలై విచ్చేసినారు వాకిలిలో ఊరు వాడా వేడుకా ప్రతి ఒక్కరి హౄదయం వేదిక లేనే లేదు తీరికా ప్రతి నిమిషం తెలియని తికమకా మైనాలు కోయిలలు కూర్చోలేదు కొమ్మలలో మా వాళ్ళై అయినోళ్ళై ఒక చెయ్యేసినాయి మేళంలో పందిరిలోన పండుగలన్ని నిలుపుతున్న పెళ్ళి నవ్వులలోన కన్నుల తడిని కలుపుతున్న పెళ్ళి మా నాన్నా మా అన్న ఇద్దరు నాకు పుట్టిళ్ళు అందరికి సెలవంటు నేవెళ్ళి వొస్తా అత్తిళ్ళు చల్లని చూపే కాటుకా ఇక తరగని ప్రేమే బొట్టుగా మమకారాలే సిరులుగా మెట్టింట్లో ఉంటా సీతగా ఆత్రాన్నయి సూత్రన్నయి ముద్దుగా వెస్తా బంధాలు నేస్తాన్నయి నీ వాడ్నై నీ వద్ద వుంటా వందేళ్ళు మాటలు కలిసే మనసులు కలిసే ముచ్చటయిన పెళ్ళి కలిసిన మనసె శక్షిగా నిలిచే స్వచ్చమయిన పెళ్ళి

15, జులై 2021, గురువారం

Lakshmi Narasimha : Jada Thoti Kodithe Song Lyrics (జడ తోటి కొడితే)

చిత్రం: లక్ష్మి నరసింహ (2004)

సాహిత్యం: చంద్రబోస్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , సుజాత

సంగీతం: మణి శర్మ


పల్లవి:

జడ తోటి కొడితే జగ్గల్ పేట్లో పడతావ్ ఓ రబ్బి కొట్టేయనా

కుడి కన్ను కొడితే కాకినాడ్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా

నువ్వు నన్ను కొట్టినా, నే నిన్ను కొట్టినా

ఆ ఉట్టి కొట్టేది మనమే కదా

నువ్వు చిలకలే కొడుతుంటే నారాయణ

కన్నె చీరమ్మ బెణికింది నారాయణ

నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ

ఉన్న నిదరమ్మ బెదిరింది నారాయణ

జడ తోటి కొడితే జగ్గల్ పేట్లో పడతావ్ ఓ రబ్బి కొట్టేయనా

కుడి కన్ను కొడితే కాకినాడ్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా


చరణం:1

ప్రేమించి పెళ్ళాడినా... ఓ ఓ పెళ్ళాడి ప్రేమించినా... ఓ ఓ

ముందుకొచ్చినా, పక్కకొచ్చినా, మీదికొచ్చినా నేనేగా

కొపమోచ్చినా, కోరికొచ్చినా, దారికొచ్చినా నేనేగా

చలి తలుపులకొక నిచ్చెన వేస్తావా ఇవ్వాళ

ఒడి దుడుకులకొక వంతెన కట్టాలా పూబాలా

చలి తలుపులకొక నిచ్చెన వేస్తావా ఇవ్వాళ

ఒడి దుడుకులకొక వంతెన కట్టాలా పూబాలా

నీ ఆటే కట్టినా, నిన్నే ఆకట్టినా

ఆ తాళి కట్టేది నాకే కదా

కొత్త కౌగిళ్ళు కడుతుంటే నారాయణ

కొంగు గొంగళ్ళు పరిచింది నారాయణ

సోకు పెద్దిల్లు కడతుంటే నారాయణ

సిగ్గు చిన్నిల్లు కూలింది నారాయణ


చరణం:2


చాపేసి దిండేసినా... ఓ ఓ దిండేసి చాపేసినా... ఓ ఓ

సేవ చేసినా, దాడి చేసినా, గొడవ చేసినా నేనేగా

తప్పు చేసినా, ఒప్పు చేసినా, చెప్పి చేసినా నేనేగా

గిలిగిలి గిలిగింతలు కావాలా గోపాల

మరుమరు మరుమల్లెలు పెట్టాలా ప్రియురాలా

హోయ్ గిలిగిలి గిలిగింతలు కావాలా గోపాల

మరుమరు మరుమల్లెలు పెట్టాలా ప్రియురాలా

మోమాటం పెట్టినా, ఇరకాటం పెట్టినా

అడిగింది పెట్టేది నేనే కదా

సుముహుర్తాలు పెడుతుంటే నారాయణ

సన్న నడువమ్మ నవ్వింది నారాయణ

పాలు పళ్ళన్నీ పెడుతుంటే నారాయణ

పట్టు పరుపమ్మ ఏడ్చింది నారాయణ

జడ తోటి కొడితే జగ్గల్ పేట్లో పడతావ్ ఓ రబ్బి కొట్టేయనా


కుడి కన్ను కొడితే కాకినాడ్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా

నువ్వు నన్ను కొట్టినా, నే నిన్ను కొట్టినా

ఆ ఉట్టి కొట్టేది మనమే కదా

నువ్వు చిలకలే కొడుతుంటే నారాయణ

కన్నె చీరమ్మ బెణికింది నారాయణ

నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ

ఉన్న నిదరమ్మ బెదిరింది నారాయణ

Lakshmi Narasimha : Andam Lo Andhra Kosta Song Lyrics (అందంలో ఆంధ్రా కోస్తా)

చిత్రం: లక్ష్మి నరసింహ (2004)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శ్రేయ ఘోషల్

సంగీతం: మణి శర్మ



పల్లవి:

అందంలో ఆంధ్రా కోస్తా

నీకే నా బందోబస్తా

అంతేదో చూస్తా జోరుగా

అందాలే చందాలేస్తా

మందార గంధాలేస్తా

రాసిస్తా నన్నే తేరగా

కస్సుల బుస్సుల కారప్పొడి

కసే కసమిస నా దోపిడి

కిస్సుకి మిస్సుకి వెంటే పడి

కథే నడిపితే నీకే పిడి

నచ్చావులే మెచ్చానులే

జివ్వు జివ్వంటూ కవ్వించుకుంటాను రావే మరి

కుడికాలే కదిలంది

కుడికన్నే అదిరింది హోయ్

అందంలో ఆంధ్రా కోస్తా

నీకే నా బందోబస్తా

అంతేదో చూస్తా జోరుగా


చరణం:1

మత్తెక్కే అందాలా మహిళామణి

చెయ్యవే హాయిగా పూబోణి

కమ్ముకుంటే పాడుతుంది కళ్యాణి

సయ్యంటూ కలిపాను చేయి చేయీ

ఎత్తులే వేయకు అబ్బాయి

అందుకైతే మోగనివ్వు సన్నాయి

గుచ్చుకుంటే నీకు ఈడు ముల్లు

చిట్టి చెంపబుగ్గే నాకు చెంపగిల్లు

కట్టుకున్నాక పుట్టేది ఆహా హైలెస్సులే

కుడికాలే కదిలంది

కుడికన్నే అదిరింది హాయ్

అందంలో ఆంధ్రా కోస్తా

నీకే నా బందోబస్తా

అంతేదో చూస్తా జోరుగా


చరణం:2

భామా నీ బాడీకి బందోబస్తూ

సిగ్గులే దోచితే శ్రీరస్తూ

కంటితోనే ఒంటి తేనే లాగేస్తూ

పొమ్మంటే రమ్మంటూ నీతో చిక్కూ

గాలిలో ముద్దుల మ్యూజిక్కూ

లాహిరాల కళ్ళతోటి మ్యాజిక్కూ

జబ్బ చూస్తే పచ్చి దెబ్బ పండు

నువ్వు నవ్వుతుంటే నాకు మల్లెచెండూ

ప్రేమ కోరింది నాతోటి నీ పెళ్లి పేరంటమే

కుడికాలే కదిలంది

కుడికన్నే అదిరింది

అందంలో ఆంధ్రా కోస్తా

నీకే నా బందోబస్తా

అంతేదో చూస్తా జోరుగా

అందాలే చందాలేస్తా

మందార గంధాలేస్తా

రాసిస్తా నన్నే తేరగా

కస్సుల బుస్సుల కారప్పొడి

కసే కసమిస నా దోపిడి

కిస్సుకి మిస్సుకి వెంటే పడి

కథే నడిపితే నీకే పిడి

నచ్చావులే మెచ్చానులే

జివ్వు జివ్వంటూ కవ్వించుకుంటాను రావే మరి

కుడికాలే కదిలంది

కుడికన్నే అదిరింది హోయ్