29, జులై 2021, గురువారం

Maa Annayya : Thajaga Maayintlo song Lyrics (తాజాగా మా ఇంట్లో )

చిత్రం:మా అన్నయ్య(2000)

సంగీతం: S.A.రాజ్ కుమార్

సాహిత్యం: 

గానం: చిత్ర, సుజాత మోహన్, మనో



తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను దర్జాగ మా మరిది ఇక రాజాలా తిరిగేను కొత్త యువరాణి రానుంది ఈ అంతఃపురం ఏలగ అంతా సంతోషంలో తేలగా తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను పండుగ కాని రోజేదంట మనసున నేసిన మమతల పొదరింట అందరికోసం వంటరి అయినా అన్నకు పండుగ మా సుఖమేనంటా ఈ ఇల్లే వెయ్యిల్లు మొదలవును ఇక ఈ అన్న ఒక మంచి కథ అవును తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను జానెడు తాడు కట్టినవాడు జన్మలు ఏలే నీ జోడవుతాడు పున్నమి రెమ్మా పుత్తడి బొమ్మా మమతల కోవెల మెట్టిన ఇల్లమ్మా ముత్తైదు మురిపాల జీవించు అన్న ఆనంద భాష్పాలు దీవించు తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను కొత్త యువరాణి రానుంది ఈ అంతఃపురం ఏలగ అంతా సంతోషంలో తేలగా ఈ అంతఃపురం ఏలగ అంతా సంతోషంలో తేలగా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి