Maa Annayya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Maa Annayya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, జులై 2021, గురువారం

Maa Annayya : Thajaga Maayintlo song Lyrics (తాజాగా మా ఇంట్లో )

చిత్రం:మా అన్నయ్య(2000)

సంగీతం: S.A.రాజ్ కుమార్

సాహిత్యం: 

గానం: చిత్ర, సుజాత మోహన్, మనో



తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను దర్జాగ మా మరిది ఇక రాజాలా తిరిగేను కొత్త యువరాణి రానుంది ఈ అంతఃపురం ఏలగ అంతా సంతోషంలో తేలగా తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను పండుగ కాని రోజేదంట మనసున నేసిన మమతల పొదరింట అందరికోసం వంటరి అయినా అన్నకు పండుగ మా సుఖమేనంటా ఈ ఇల్లే వెయ్యిల్లు మొదలవును ఇక ఈ అన్న ఒక మంచి కథ అవును తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను జానెడు తాడు కట్టినవాడు జన్మలు ఏలే నీ జోడవుతాడు పున్నమి రెమ్మా పుత్తడి బొమ్మా మమతల కోవెల మెట్టిన ఇల్లమ్మా ముత్తైదు మురిపాల జీవించు అన్న ఆనంద భాష్పాలు దీవించు తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను కొత్త యువరాణి రానుంది ఈ అంతఃపురం ఏలగ అంతా సంతోషంలో తేలగా ఈ అంతఃపురం ఏలగ అంతా సంతోషంలో తేలగా

1, జులై 2021, గురువారం

Maa Annayya : Neeli Ningilo Song Lyrics (నీలి నింగిలో నిండు జాబిలి)

చిత్రం:మా అన్నయ్య(2000)

సంగీతం: S.A.రాజ్ కుమార్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: హరిహరన్



పల్లవి:

నీలి నింగిలో నిండు జాబిలి

నువ్వు రావాలి నీ నవ్వు కావాలి 

కలహంస లాగ రావే

కలలన్ని తీర్చిపోవే

నా ప్రేమ శృతి నీవే

ప్రతి జన్మ జత నీవే


నీలి నింగిలో నిండు జాబిలి

నువ్వు రావాలి నీ నవ్వు కావాలి 


చరణం:1

దేవుడు కనబడి వరమిస్తే

వేయి జన్మలు ఇమ్మంటా

ప్రతి ఒక జన్మ నా కంటే

నిన్ను మిన్నగా ప్రేమిస్తా

దేవతే నీవని గుడి కడతా

జీవితమంతా పుజిస్తా 

నువ్వు రావాలి నీ నవ్వు కావాలి


నీలి నింగిలో నిండు జాబిలి

నువ్వు రావాలి నీ నవ్వు కావాలి 


చరణం:2

ప్రేమకు మరుపే తెలియదులే

మనసు ఎన్నడు మరువదులే 

తెరలను తీసి నను చూడు

జన్మజన్మకు నీ తోడు 

వాడనిదమ్మా మన వలపు

ఆగనిదమ్మా నా పిలుపు 

నువ్వు రావాలి నీ నవ్వు కావాలి


నీలి నింగిలో నిండు జాబిలి

నువ్వు రావాలి నీ నవ్వు కావాలి

కలహంస లాగ రావే

కలలన్ని తీర్చిపోవే

నా ప్రేమ శృతి నీవే

ప్రతి జన్మ జత నీవే


నీలి నింగిలో నిండు జాబిలి

నువ్వు రావాలి నీ నవ్వు కావాలి

Maa Annayya : Mynaa Emynave Song Lyrics (మైనా ఏమైనవే మన్మధమాసం)

 

చిత్రం:మా అన్నయ్య(2000)

సంగీతం: S.A.రాజ్ కుమార్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: P.ఉన్నికృష్ణన్, చిత్ర



మైనా ఏమైనవే మన్మధమాసం

ఐనా ఎంతైనా మెత్తని మోసం

తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక

నీకు తోడు నేనిక నీవు లేని లేనికా

సాగు అల్లిక కొనసాగయికా  

పూల మాలిక చలి పూజకే  ఇకా


విరహల నీటూర్పు వీరజాజి ఓదార్పు

చలిగాలి సాయంత్రాల స్వాగతమే

పై పైకొచ్చే తాపాలు పైతం ఇచ్చే శాపాలు

యదతోనే ముందుగా చేసే కాపురమే

ఎవరేమైనా ఎదురేమైనా నీనేమైనా నీవే మైనా

ఈ పువ్వుల్లో పూవై  నిను పూజేస్తున్నా


మైనా ఏమైనవే మన్మధమాసం

ఐనా ఎంతైనా మెత్తని మోసం


సంధిపొద్దు నేరాలు అందమైన తీరాలు   

దాటేస్తే కాదనన్నా ఎపుడైనా

కవ్విస్తున్నా నీ కళ్ళు  కైపెకించ్చే పోకడ్లు

కాటేస్తే కాదంటాన ఇప్పుడైనా

వయస్సేమైనా సొగసేమైనా మైమరిపించే మనసేమైనా

నవ్వు నవరాత్రి నీకోసం తీసుకువస్తున్నా...


మైనా ఏమైనవే మన్మధమాసం

ఐనా ఎంతైనా మెత్తని మోసం

తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక

నీకు తోడు నేనిక నీవు లేని లేనికా

సాగు అల్లిక కొనసాగయికా  

పూల మాలిక చలి పూజకే  ఇకా