చిత్రం :మనం(2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం :
నననాననా నననాననా నాన నాననా
నననాననా నననాననా నాన నాననా ఓ.
లలలలలలాల లలలలలలాల లలలలలలాల లాలలా
కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా
నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా
ఒకరిది కన్ను ఒకరిది చూపు
ఇరువురి కలయిక కంటి చూపు
ఒకరిది మాట ఒకరిది భావం
ఇరువురి కదలిక కదిపిన కథ
ఇది ప్రేమా ప్రేమా. తిరిగొచ్చే తియ్యగా.
ఇది ప్రేమా ప్రేమా. ఎదురొచ్చే హాయిగా.
ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా. ఆ ఆ ఆ ఆ.
నాననా నననా నానా నాననా నాననానా
నాననా నాననా నానా నాననా నాననా నానా
హోలాలా అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా
హా. అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా
పిల్లలు వీళ్లే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా
కన్నోళ్లతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ
ఇది ప్రేమా ప్రేమా. తిరిగొచ్చే తియ్యగా.
ఇది ప్రేమా ప్రేమా. ఎదురొచ్చే హాయిగా.
ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా. అ అ అ ఆ...
ఆ ఆ ఆ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా
కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా
జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరిచి పోలేనుగా
మీరూపినా ఆ ఊయల నా హృదయపు లయలలొ పదిలము కద
ఇది ప్రేమా ప్రేమా. తిరిగొచ్చే తియ్యగా.
ఇది ప్రేమా ప్రేమా. ఎదురొచ్చే హాయిగా.
ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా. అ అ అ ఆ...
ననననననాన ననననననాన ననననననాన న న న న
ననననననాన ననననననాన ననననననాన న న న న
Best song in the world
రిప్లయితొలగించండిMy favourite song
I love this song very much
true
తొలగించండిSuper song
రిప్లయితొలగించండి