చిత్రం: మన్మధుడు(2002 )
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
నా మనసునే మీటకే నేస్తమా.. నా దారిలో చేరకే చైత్రమా.. సరదాల చిలిపితనమా..చిరునవ్వులోని స్వరమా నా తలుపుతట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా .. నా మనసునే మీటకే నేస్తమా.. నా దారిలో చేరకే చైత్రమా.. నా...కెందుకిలా అవుతోంది చెప్పవా ఒక్కసారి నీ...వెంటపడే ఆశలకి చూపవా పూలదారి చినుకల్లే చేరి వరదల్లే మారి ముంచేస్తే తేలేదెలాగ ?? తడిజాడలేని తమగుండెలోని దాహాలు తీరేదెలాగ ?? లేనిపోని సయాటతో వెంటాడకే ప్రేమా .. నీ కనులలో వెలగనీ ప్రియతమా నీ పెదవికే తెలుపనీ మధురిమ *నీ...ఊహలలో కొంటెతనం పలకరిస్తోంది నన్ను నీ...ఊపిరితో అల్లుకుని పులకరిస్తోంది వెన్ను అలవాటుపడిన ఎద చీకటింట సరికొత్త వేకువై రావా కిరణాలు పడని తెరచాటులోని ఏకాంతమే వదులుకోవా నన్ను నేను మరిచేంతలా మురిపించకే ప్రేమా .. నీ కనులలో వెలగనీ ప్రియతమా నీ పెదవికే తెలుపనీ మధురిమ సరదాల చిలిపితనమా..చిరునవ్వులోని స్వరమా నా తలుపుతట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి