చిత్రం: మన్మధుడు(2002 )
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: వేణు, సుమంగళి
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది...
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది...
నిలవదు కద హృదయం…
నువు ఎదురుగ నిలబడితే...
కదలదు కద సమయం…
నీ అలికిడి వినకుంటే...
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది!
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది...
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది...
మనసా మనసా మనసా...
మనసా మనసా మనసా...
మనసా మనసా మనసా... ఓ మనసా!
పువ్వులో లేనిది... నీ నవ్వులో ఉన్నది...
నువ్వు ఇపుడన్నది... నేనెప్పుడూ విననిది...
నిన్నిలా చూసి పయనించి… వెన్నెలే చిన్న బోతోంది...
కన్నులే దాటి కలలన్నీ… ఎదురుగా వచ్చి నట్టుంది...
ఏమో… ఇదంతా… నిజంగా కలలాగే ఉంది!
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది...
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది...
ఎందుకో తెలియని... కంగారు పడుతున్నది...
ఎక్కడా జరగని... వింతేమి కాదే ఇది...
పరిమళం వెంట పయనించి…
పరుగు తడబాటు పడుతోంది...
పరిణయం దాక నడిపించీ…
పరిచయం తోడు కోరింది...
దూరం... తలొంచే... ముహూర్తం ఇంకెపుడొస్తుంది!
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది...
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది...
నిలవదు కద హృదయం… నువు ఎదురుగ నిలబడితే...
కదలదు కద సమయం… నీ అలికిడి వినకుంటే...
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది!
మనసా మనసా మనసా...
మనసా మనసా మనసా...
మనసా మనసా మనసా... ఓ మనసా!