8, జులై 2021, గురువారం

Nee kosam : Neekosam Song Lyrics (నీకోసం నీకోసం)

చిత్రం : నీకోసం (1999)

సంగీతం : ఆర్.పి పట్నాయక్

రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి

గానం: రాజేష్ , కౌసల్య





........నీకోసం నీకోసం... నీకోసం నీకోసం

ఎపుడూ లేని ఆలోచనలు

ఇపుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం నీకోసం

ఈలోకమిలా ఏదో కలలా

నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది

నీకోసం నీకోసం... నీకోసం నీకోసం


నాలో ఈ ఇది ఏరోజూ లేనిది

ఏదో అలజడి నీతోనే మొదలిది

నువ్వే నాకని పుట్టుంటావని

ఒంటిగా నీ జంటకే ఉన్నాను నేనిన్నాళ్ళుగా

నీకోసం నీకోసం.... నీకోసం నీకోసం


నాలో ప్రేమకి ఒక వింతే ప్రతీది

వీణే పలకని స్వరమే నీ గొంతుది

మెరిసే నవ్వది మోనాలీసది

ఈ నిజం ఇక కాదనే ఏ మాటనూ నే నమ్మను


ఎపుడూ లేని ఆలోచనలు

ఇపుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం నీకోసం

ఈలోకమిలా ఏదో కలలా

నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది

నీకోసం నీకోసం... నీకోసం నీకోసం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి