8, జులై 2021, గురువారం

Gemini : Pulalo Tene Prema Song (పూలలో తేనే ప్రేమ )

చిత్రం : జెమినీ

సంగీతం : ఆర్.పి పట్నాయక్

రచయిత : వేటూరి

గానం : రాజేష్


పల్లవి :

పూలలో తేనే ప్రేమ తేనెలో తీపి ప్రేమ 

తీపిలో హాయి ప్రేమ హాయి నీవంది ప్రేమ

బహుశా నా ప్రాణమై నిలిచే  నీ ప్రేమ 

మనసు అది ఏమిటో తెలియనిది ఈ ప్రేమ 

పూలలో తేనే ప్రేమ తేనెలో తీపి ప్రేమ 

తీపిలో హాయి ప్రేమ హాయి నీవంది ప్రేమ


చరణం 1 :

కమ్మని కల కౌగిలి కథ ఎర్రని పెదాలలో ప్రేమ 

వెన్నెల కల వెచ్చని వల నీవు నేనైనా ప్రేమ 

కమ్మని కల కౌగిలి కథ ఎర్రని పెదాలలో ప్రేమ 

వెన్నెల కల వెచ్చని వల నీవు నేనైనా ప్రేమ 

కాలం చెల్లని ప్రేమ ఈదూరపు చేరువ ప్రేమ 

సింధూరుపు తూరుపు  ప్రేమ నీవు సుమా 

పూలలో తేనే ప్రేమ తేనెలో తీపి ప్రేమ 

తీపిలో హాయి ప్రేమ హాయి నీవంది ప్రేమ


 చరణం  2

ఆ పరిచయం ఈ పరిమళం పూసిన ఎడారి నా ప్రేమ 

కోరిన సుఖం చేరిన సగం నాకు నీవైనా ప్రేమ 

ఆ పరిచయం ఈ పరిమళం పూసిన ఎడారి నా ప్రేమ 

కోరిన సుఖం చేరిన సగం నాకు నీవైనా ప్రేమ 

చూపుగా నాటిన ప్రేమ కనుచూపుకు అందని ప్రేమ 

అందానికి అందం తెచ్చే ప్రేమ సుమా..


పూలలో తేనే ప్రేమ తేనెలో తీపి ప్రేమ 

తీపిలో హాయి ప్రేమ హాయి నీవంది ప్రేమ

బహుశా నా ప్రాణమై నిలిచే  నీ ప్రేమ 

మనసు అది ఏమిటో తెలియనిది ఈ ప్రేమ 

పూలలో తేనే ప్రేమ తేనెలో తీపి ప్రేమ 

తీపిలో హాయి ప్రేమ హాయి నీవంది ప్రేమ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి