చిత్రం: నిన్నే పెళ్లాడతా (1996)
సంగీతం: సందీప్ చౌతాలా
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: హరిహరన్ , కె.ఎస్ చిత్ర
పల్లవి :
కన్నుల్లోని నీ రూపమే...గుండెల్లోని నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే...నా శ్వాస నీ కోసమే
ఆ ఊసుని తెలిపేందుకు...నా భాష ఈ మౌనమే
కన్నుల్లోని నీ రూపమే... గుండెల్లోని నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే... నా శ్వాస నీ కోసమే
చరణం 1 :
మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి.. నీ చూపునాపేదెలా
నీ నీలికన్నుల్లో పడి మునకలేస్తున్న ...నా మనసు తేలేదెలా
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం
కన్నుల్లోని నీ రూపమే...గుండెల్లోని నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే...నా శ్వాస నీ కోసమే
చరణం 2:
అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను...మదిలోని మాటేదని తల వంచుకొని నేను తెగ ఎదురు చూశాను...నీ తెగువ చూడాలని చూస్తూనే రేయంతా తెలవారిపోతుంటే.. ఏమో ఎలా ఆపడం కన్నుల్లోని నీ రూపమే...గుండెల్లోని నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే... నా శ్వాస నీ కోసమే ఆ ఊసుని తెలిపేందుకు...నా భాష ఈ మౌనమే కన్నుల్లోని నీ రూపమే...గుండెల్లోని నీ ధ్యానమే... నా ఆశ నీ స్నేహమే... నా శ్వాస నీ కోసమే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి