2, జులై 2021, శుక్రవారం

Nuvvu Nenu : Nuvve Naku Pranam Song Lyrics (నువ్వే నాకు ప్రాణం)

చిత్రం : నువ్వు నేను(2001)

సంగీతం: R.P.పట్నాయక్

సాహిత్యం: కులశేఖర్

గానం:  K.K, ఉష, కోరస్


నువ్వే నాకు ప్రాణం...నువ్వే నాకు లోకం...

ప్రేమే రాగ బంధం ప్రేమే వేద మంత్రం

కష్టాలెన్ని ఎదురైనా గాని

మనకున్న బలమే ప్రేమ ప్రేమ..


నీలో ఆశ రేపే శ్వాస పేరే ప్రేమ కాదా

లోలో పల్లవించే పాట పేరే ప్రేమ కాదా

జీవితానికో వరం ప్రేమనీ

ప్రేమ లేని జీవితం లేదనీ..

ఒకటై పలికేనట ఈ పంచ భూతాలు


నిన్ను నన్ను కలిపే వలపు పేరే ప్రేమ కాదా

మిన్ను మన్ను తడిపే చిలిపి చినుకే ప్రేమ కాదా

లోపమంటు లేనిదే ప్రేమని

ప్రేమ నీకు శాపమేం కాదనీ

ఎదలో పలికేనట కళ్యాణ రాగాలు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి