చిత్రం : నువ్వు నేను(2001)
సంగీతం: R.P.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: సందీప్, ఉష, కోరస్
నా గుండెలో నీవుండిపోవా నా కళ్ళల్లో దాగుండిపోవా
చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా...
నా గుండెలో నీవుండిపోవా నా కళ్ళల్లో దాగుండిపోవా
చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా...
నా హృదయం ప్రతి వైపు వెతికింది నీ కోసమేలే
నా నయనం ఎటు వైపు చూస్తున్న నీ రూపమేలే
నీ .....పాటలో పల్లవే కావాలి
నా .....ఎదలో మెదిలే కధలే పాడాలి... పాడాలి...
నీ కళ్ళల్లో నన్నుండిపోనీ నీ గుండెలో రాగాన్ని కానీ
సిరివెన్నెలై వచ్చి కనురెప్పలే తెరచి
మన ప్రేమనే చూపనీ...
నీ కళ్ళల్లో నన్నుండిపోనీ
ఏ నిమిషం మొదలైనదో గాని మన ప్రేమ గాధ
ప్రతి నిమిషం సరికొత్తగా ఉంది ఈ తీపి బాధ
ఈ .... దూరమే దూరమై పోవాలి
నీ ....జతలో బతుకే నదిలా సాగాలి.. సాగాలి. సాగాలి.
నీ గుండెలో రాగాన్ని కానీ....
చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా...